Begin typing your search above and press return to search.
ఇంటి గెలిచి రచ్చగెలవాలోయ్ చిరంజీవి
By: Tupaki Desk | 15 Feb 2018 7:28 AM GMTఅమ్మకు కూడు పెట్టలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడనే సామెత ఏపీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి చిరంజీవికి సరిపోతుందని అంటున్నారు నెటిజన్లు. రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయింది. భవిష్యత్తులో ఆ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనే అనుమానం కూడా ఉంది. అయితే సొంత రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తుకి ఏం చేయాలో పాలుపోక ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని గెలిపించేందుకు ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోనున్నారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి త్వరలో జరగనున్న కర్నాటక ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాధ్యక్షుడు దినేష్ గుండూ రావు స్పస్టం చేశారు. తొలివిడుదత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మలివిడుత చిరంజీవి తోపాటు - సినీనటి ఖుష్బూ కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తోన్మాదమే ప్రధాన అంజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసే సత్తా కాంగ్రెస్ కు ఉందని సూచించారు. కర్నాటక ఎన్నికల్లో అన్నభాగ్య - ఇందిరా క్యాంటీన్ - తదితర సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌కు శ్రీరామరక్ష కానున్నాయని దినేశ్ గుండూరావు అభిప్రాయపడ్డారు.