Begin typing your search above and press return to search.
ఏర్పాట్లు పరిశీలించేది ఇప్పుడా చిరంజీవి..?
By: Tupaki Desk | 14 July 2015 9:44 AM GMTగోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి మొదటి ఘాట్‌లో పెద్దఎత్తున తొక్కిసలాట చోటు చేసుకోవటం.. ఈ సందర్భంగా భారీగా భక్తులు మృత్యువాత పడటం తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
విపక్ష నేత.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గళం విప్పారు. చంద్రబాబుకు ప్రచారం యావ తప్పించి మరొకటి లేదని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఒకరిద్దరు మరణిస్తే.. వైఎస్ ను రాజీనామా చేయాలని చంద్రబాబు నానాయాగీ చేశారని.. మరి ఇంతమంది మరణిస్తే చంద్రబాబు ఏం చేస్తున్నారన్న చిరు.. చంద్రబాబు చచ్చినా తన పదవికి రాజీనామా చేయరని తేల్చేశారు.
రాజమండ్రి వెళుతున్న తాను.. బాధితుల్ని పరామర్శించటంతోపాటు.. పుష్కర ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తానని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పని తీరు సరిగా లేనప్పుడు..వారి లోపాల్ని ఎత్తి చూపటం తప్పేం కాదు. కానీ.. ఇంతమంది మరణించిన తర్వాత.. అధికారపక్షం మాదిరే.. ప్రతిపక్షం కూడా నిద్ర లేవటం ఏమిటి?
పుష్కర పనుల్ని పరిశీలిస్తానని చెప్పిన చిరు.. ఇప్పటివరకూ ఏం చేసినట్లు? చిరంజీవికి కనుక అంత మమకారమే ఉండి ఉంటే.. పుష్కరాల ఏర్పాట్లను ఒక్కసారి అయినా వెళ్లి చూసి వచ్చారా? పనులు ఎలా జరుగుతున్నాయన్నది చూశారా?
పుష్కర ఏర్పాట్లపై ఏపీ సర్కారు భారీ ప్రచారం చేసుకుంటున్న వేళ.. నిజంగా ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయా? లేదా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సౌకర్యాల మాటేమిటి?లాంటి వాటిని చూసిన పాపాన పోయింది లేదు. పనులు చేయించటంలో అధికారపక్షం విఫలమైందనుకుంటే.. జరుగుతున్న పనుల్ని సమీక్షించాల్సిన విషయంలో విపక్షం కూడా అడ్డంగా ఫెయిల్ అయ్యిందన్న విషయం మర్చిపోకూడదు.
27 మంది మరణించిన తర్వాత వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తానంటున్న చిరంజీవి ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెబుతారా? పుష్కరాల పనుల్లో లోటుపాట్ల గురించి విపక్షం కానీ విరుచుకుపడి ఉంటే.. అధికారపక్షం మరింత జాగరూకతో ఉండేదేమో. ఇదేమీ.. అధికారపక్షాన్ని వెనకేసుకురావటం కానీ.. వత్తాసు పలకటం కానీ చేయటం కాదు. కేవలం.. విపక్షం కూడా బాధ్యతగా వవ్యవహరించి ఉండే బాగుండేదన్న మాట చెప్పటం మాత్రమే. ఏమైతేనేం.. ఎవరికి వారు చేసిన తప్పులకు.. మూల్యం మాత్రం అమాయక ప్రజలే చెల్లించాల్సి రావటమే మహా విషాదం.