Begin typing your search above and press return to search.
మళ్లీ జనంలోకి చిరంజీవి
By: Tupaki Desk | 22 Feb 2016 10:01 AM GMTకేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ నేత చిరంజీవి చాలాకాలం తరువాత జనంలోకి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన పర్యటిస్తున్నారు. మొగల్తూరు మండలంలోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరంజీవి ఈ రోజు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
పేరుపాలెం గ్రామానికి ఆయన ఆ గ్రామానికి రూ. 5 కోట్లు మంజూరు చేసిన ఆయన గ్రామంలో రెండు కమ్యునిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చిరంజీవి మాట్లాడారు. మొగల్తూరులో రూ. 50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
విభజన అనంతరం దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడిన తరువాత చిరంజీవి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడంలేదు. ఆమధ్య రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఆయన వెంట పర్యటనలో పాల్గొన్న చిరంజీవి ఆ తరువాత సైలెంటయిపోయారు. ఇటీవల కాపుల రిజర్వేషన్ కోసం ఆమరణ దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించేందుకు వచ్చినా రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలోనే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కిర్లంపూడి వెళ్లలేకపోయారు. మళ్లీ ఇప్పుడు దత్తత గ్రామం పేరుపాలెంలో పర్యటిస్తున్నారు.