Begin typing your search above and press return to search.

చిరంజీవి టచ్ లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారా....?

By:  Tupaki Desk   |   8 Oct 2022 6:27 AM GMT
చిరంజీవి టచ్ లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారా....?
X
మెగాస్టార్ గా పేరు పొంది కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవికి రాజకీయాలు అచ్చిరాలేదు అని అంటారు. కానీ ఆయన రాంగ్ టైం లో పార్టీ పెట్టి ఓడిపోయారు అని తలపండిన రాజకీయ జీవులు చెబుతారు. 2009లో కాకుండా 2014లో కనుక చిరంజీవి పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అయి ఉండేవారని కూడా అంటారు. అయితే గడచిన దానిని ఎవరూ మార్చలేరు. కానీ ఇపుడు చిరంజీవి మరో మారు రాజకీయాల వైపు చూస్తే కనుక పరిణామాలు అన్నీ ఆయనకు అనుకూలంగా ఉంటాయని అంటారు.

అయితే 2018లో తన రాజ్యసభ సభ్యత్వం ముగియడంతోనే చిరంజీవి రాజకీయాల విషయంలో ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఆయన మీడియా ఇంటర్వ్యూలలో కూడా గతంలో తనకు రాజకీయాలు ఇష్టం లేదు అన్నట్లుగానే మాట్లాడారు. దాంతో ఎన్ని పార్టీలు ఆయన్ని పాలిటిక్స్ లోకి మళ్ళీ తీసుకురావాలని చూసినా కూడా నో చెప్పేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇపుడు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్లుగా చేసిన కొన్ని ప్రకటనలతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన ఆయన సినిమాలో నిండా రాజకీయ డైలాగులే ఉన్నాయి. పైగా రాజకీయాలు తాను వద్దనుకున్నా అవి తనను వదలడంలేదని చిరంజీవి అన్న డైలాగ్ కూడా సినిమా కోసం మాత్రమే కాదని వర్తమాన రాజకీయాలను గమనించే ఆయన ఇలా అంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ అయితే ఉంది.

దానికి కొనసాగింపుగా ఆయన గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ జనసేనకు తన అండ మద్దతు ఉంటాయని చెప్పేశారు. దాంతో చిరంజీవి రాజకీయ రీ ఎంట్రీ ఖాయమని అంతా భావిస్తున్నారు. దాంతో ఇపుడు వివిధ పార్టీలలో ఉన్న వారు సైతం చిరంజీవి తో మాట్లాడేందుకు సిద్ధపడుతున్నారని ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చిరంజీవికి టచ్ లోకి వెళ్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వారు తమ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. చిరంజీవి ప్రజరాజ్యం పార్టీ పెట్టి 70 లక్షల ఓట్లను సాధించారు. అలాగే 18 సీట్లను సాధించారు. ఆయన పొలిటికల్ స్టామినా ఏంటి అన్నది ఒక విధంగా నాడు రుజువు అయింది. అలాగే కాపు సామాజికవర్గంలో చిరంజీవికి మంచి పేరు మర్యాద ఉన్నాయి.

ఆయన కనుక రీ ఎంట్రీ ఇస్తే కచ్చితంగా పార్టీల భేదం లేకుండా చాలా మంది చిరంజీవి పక్కన చేరడం ఖాయమని అంటున్నారు. అది వైసీపీ అయినా టీడీపీ అయినా కూడా చిరంజీవితోనే తమ రాజకీయం అని మళ్లీ పక్కన చేరుతారు అని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలలో ఇపుడు మెగా ప్రకంపనలు భారీ ఎత్తున ఉన్నాయని అంటున్నారు. ఈ రోజున వైసీపీలో ఉన్న వారిలో అత్యధికులు ఒక‌నాడు చిరంజీవి వెంట నడచినవారే కావడంతో మెగా స్టార్ రీ ఎంట్రీ ఇస్తే కనుక కచ్చితంగా ఆయన పక్కన ఉండేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారుట.

ఈ రాజకీయ పరిణామాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే అంటున్నారు. అదే సమయంలో ఏపీలో రాజకీయ సమీకరణలు కూడా మారేందుకు ఆస్కారం ఏర్పడుతోంది అని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తారు అన్న వార్తలు ఇపుడు ఏపీ రాజకీయాలను షేక్ చేసి పారేస్తున్నాయి. నిజంగా కనుక జనసేన వెనక మెగాస్టార్ గట్టిగా నిలబడితే టోటల్ పాలిటిక్స్ ఏపీలో చేంజ్ అవడం ఖాయమని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.