Begin typing your search above and press return to search.
చిరంజీవ... చిరంజీవ... జగన్ కి మెగా గ్రీటింగ్స్
By: Tupaki Desk | 21 Dec 2021 12:51 PM ISTవైఎస్ జగన్ ఏపీ యువ ముఖ్యమంత్రి. ఈ రోజు ఆయన తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు వెల్లువలా శుభాకాంక్షలు వస్తున్నాయి. ఆయనకు రాజకీయ రంగం నుంచే కాకుండా సినీ రంగం నుంచి కూడా పెద్ద ఎత్తున పలువురు ప్రముఖులు గ్రీట్స్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పెద్ద, మెగా స్టార్ చిరంజీవి జగన్ కి బర్త్ డే గ్రీట్ చేశారు. జగన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చిరంజీవి ట్విట్టర్ వేదికగా కోరారు. ఇదిలా ఉంటే చిరంజీవితో జగన్ కి మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవిని అన్నా అంటూ ఆయన ఆప్యాయంగా పలకరిస్తారు, గౌరవిస్తారు.
జగన్ సీఎం అయ్యాక తాడేపల్లిలోని తన ఇంటికి చిరంజీవి దంపతులను పిలిచి మరీ విందు చేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ఇక చిరంజీవి సైతం జగన్ పాలనా విధానాల పట్ల ఎప్పటికపుడు తన సానుకూల స్పందన తెలియచేస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరి బంధం కూడా అలా అందంగా కొనసాగుతూ వస్తోంది.
ఇక సినీ రాజకీయాలతో కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయాలతో కానీ సంబంధం లేకుండా చిరంజీవి ఎపుడూ జగన్ తో మంచి చెలిమిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక జగన్ మూడు రాజధానులకు ఆయన అప్పట్లో మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచారు. అదే విధంగా చిరంజీవిని సినీ పెద్దగా జగన్ గౌరవించడమే కాదు, ఆయనతోనే సినీ సమస్యల మీద జగన్ ప్రతీసారీ చర్చిస్తూ వస్తున్నారు.
మొత్తానికి ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందన్నది నిజం. ఇక సినీ రంగాన సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబు సైతం జగన్ కి గ్రీట్ చేశారు. జగన్ నాయకత్వాన ఏపీ అన్ని విధాలుగా ముందుకు సాగాలని, ఏపీ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని మహేష్ బాబు కోరుకున్నారు.