Begin typing your search above and press return to search.
కాస్త గ్యాప్ తర్వాత బాబు సర్కారుపై చిరు ఫైర్
By: Tupaki Desk | 21 Aug 2017 5:18 PM GMTగత కొద్దికాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ - కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి తాజా ఆసక్తికరమైన అంశంతో తెరమీదకు వచ్చారు. కాస్త గ్యాప్ స్పందించిన చిరంజీవి ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఇలాకా అయిన చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రభుత్వ తీసుకుంటున్న చర్యపై అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని వార్డు నంబరు 18లో గల స్కావెంజర్స్ కాలనీ విషయంలో ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. `స్కావెంజర్స్ కాలనీలో గత 70 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న దాదాపు 160 కుటుంబాల వారిని అక్కడ నుంచి బలవంతంగా ఖాళీ చేయించి....అక్కడి రెండు ఎకరాల 34 సెంట్ల విలువైన భూమిని పైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి...తిరుపతి కార్పొరేషన్ వారు చేస్తున్న ప్రయత్నాలు అమానవీయం - సహజ న్యాయానికి విరుద్ధం`` అని మండిపడ్డారు.
దశాబ్దాలుగా - తరతరాలుగా నివాసం ఉంటున్న పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలను - యానాది కులస్తులను అక్కడి నుండి తరిమి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి వేరే చోట పునరావాసం కల్పిస్తామంటూ మభ్యపెడుతున్నారని చిరంజీవి మండిపడ్డారు. అక్కడి వారిని ఖాళీ చేయించడానికే ఈ పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. తాను శాసనసభ్యుడుగా ఉన్న సమయంలో ఈ కాలనీలో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. ``తిరుపతి నగరం నడిబొడ్డున స్కావెంజర్స్ కాలనీ ఉండటం ఈ ప్రభుత్వం సహించలేకపోతోందా? ఇది పూర్తిగా వివక్షపూరితం. ప్రజలందర్నీ సమానంగా చూడాలని మన రాజ్యంగం చెబుతున్నది. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం తన బలప్రయోగంతో బలహీనులైన పారిశుద్ధ్యకార్మిక కుటుంబాలను, యానాది కుటుంబాలను తరలించాలని చూడడం సహించరానిది, గర్హనీయం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి కార్పొరేషన్ తమ ప్రయత్నాలను విరమించుకోవాలి`` అని డిమాండ్ చేశారు. స్కావెంజర్స్ కాలనీని రోల్ మోడల్ కాలనీగా అభివృద్ధి పర్చాలని కోరారు. అక్కడి కుటుంబాల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి తగిన భరోసా ఇవ్వాలని సూచించారు. నిరుపేదలైన ఆ కుటుంబాలపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.