Begin typing your search above and press return to search.

తమ్ముడు, రాజకీయం రెండూ ఒకటేనా, వేరా?

By:  Tupaki Desk   |   2 Sep 2020 5:00 PM GMT
తమ్ముడు, రాజకీయం రెండూ ఒకటేనా, వేరా?
X
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. తమ్ముడు పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. అంటూ చిరు చేసిన బర్త్ డే ట్వీట్ ఇపుడు చర్చనీయాంశమైంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో పోటీకి వెళ్లబోతోన్న పవన్ మార్గం....ఇపుడు తాను ఏ పార్టీలో లేనని చెప్పుకున్న చిరు మార్గం ఒకటి ఎలా అవుతాయన్న విమర్శలు వస్తున్నాయి. పొలిటికల్ కెరీర్ కు దాదాపుగా గుడ్ బై చెప్పి ఫుల్ టైం సినిమాలకు కేటాయించిన చిరంజీవి....ఓ పక్క పాలిటిక్స్, మరో పక్క సినిమాలతో రెండు పడవల మీద కాళ్లు పెట్టిన పవన్ గమ్యాలు వేరు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ మాటకొస్తే కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అన్నదమ్ముల గమ్యాలు, మార్గాలు వేరయ్యాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఓ పక్క చిరంజీవి కాంగ్రెస్ లో ఉండగానే....కాంగ్రెస్ పై పవన్ ఒంటికాలిమీద లేచేవారు. ఇక, ఇటీవల చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపుతున్నారని ప్రచారం జరిగింది. చిరు కూడా జగన్ తో సత్సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. మరో పక్క వైసీపీ, సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరో పక్క త్వరలోనే జనసేన-బీజేపీ కూటమికి చిరు మద్దతు ఇస్తారేమోనన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ మార్గాలు వేరంటూ పవన్ బర్త్ డే సందర్భంగా చిరు క్లారిటీ ఇచ్చారేమో అన్న టాక్ వస్తోంది. రాబోయో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలని వచ్చానని చెప్పిన పవన్....ఇక దాదాపుగా రాజకీయాలు వద్దు అని సైలెంట్ అయిన చిరు లక్ష్యాలు ఒకటి ఎలా అవుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే చిరు దృష్టిలో తమ్ముడు వేరు ...రాజకీయం వేరా...లేదంటే రెండూ ఒకటేనా అన్న చర్చ జరుగుతోంది. చిరు, పవన్ ల లక్ష్యం, గమ్యం ఒకటా? వేర్వేరా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలి.