Begin typing your search above and press return to search.
అలా విడుదలై ఇలా అరెస్ట్ అయిన చెవిరెడ్డి
By: Tupaki Desk | 9 July 2016 8:21 AM GMTచిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టైం ఏమాత్రం బాగున్నట్లుగా అనిపించట్లేదు. పెద్ద.. పెద్ద రైళ్లను తగలబెట్టిన వారు సైతం బెయిల్ మీద రిలీజ్ అయి బయటకు వస్తున్న వేళ.. సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేసినందుకే అరెస్ట్ కావటం చెవిరెడ్డి స్పెషాలిటీ ఏమో..? సబ్ కలెక్టరేట్ లో రాత్రివేళ జరిపిన నిరసన ప్రదర్శన కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల విదులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేయటం.. కోర్టు ఆయనకు 15 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. ఈ ఉదంతంపై తాజాగా ఆయనకు బెయిల్ వచ్చి విడుదల అయ్యారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే.. జైలు నుంచి అలా బయటకు వచ్చిన చెవిరెడ్డిని.. మళ్లీ వెంటనే మరో కేసు విషయమై అరెస్ట్ చేసిన పోలీసుల తీరుతో ఆయనతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం షాక్ కు గురైన పరిస్థితి. వడమాలపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో బెయిల్ మీద విడుదలైన చెవిరెడ్డిని.. ఎంఆర్ పల్లి పోలీసులు.. తమ స్టేషన్ పరిధిలో చెవిరెడ్డిపై మరో కేసు ఉందని చెబుతూ ఆయన్ను అదుపులోకి తీసుకోవటం గమనార్హం. ఊహించని విధంగా పోలీసులు వ్యవహరించిన వైఖరి చెవిరెడ్డి బ్యాచ్ కు భారీ షాక్ కు గురి చేసిందని చెప్పొచ్చు. దీంతో.. పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జైలు ఎదుట ఆందోళన నిర్వహించారు. పాపం చెవిరెడ్డి జైలు కష్టాలు ఎప్పటికి తీరుతాయో..?