Begin typing your search above and press return to search.
మేయర్ ను చంపేసి లొంగిపోయింది ఎవరంటే..?
By: Tupaki Desk | 19 Nov 2015 4:20 AM GMTపట్టపగలు.. ప్రభుత్వ కార్యాలయంలో.. పలువురు నేతలు చూస్తుండగా.. చిత్తూరు నగర మేయర్.. ఆమె భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా సంచలనం రేపిందో తెలిసిందే. ఈ హత్యలు చేసిన కాసేపటికే ఇందులో పాలు పంచుకున్న ఇద్దరు నిందితులు.. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవటం తెలిసిందే.
అయితే.. పోలీసుల వద్ద లొంగిపోయిన ఆ ఇద్దరు నిందితులు ఎవరు? వారి వివరాలు ఏమిటన్న విషయాన్ని చిత్తూరు పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కర్ణాటకకు చెందిన దుండగులుగా అనుమానిస్తున్నాయి. తాజాగా.. పోలీసులకు లొంగిపోయిన ఇద్దరు నిందితుల వివరాలు బయటకు వచ్చాయి. జంట హత్యల అనంతరం పోలీసులకు లొంగిపోయిన నిందితులు ఇద్దరిలో ఒకరు వెంకటాచలంగా భావిస్తున్నారు. ఇతడు.. గతంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నారు. మరొకరి వివరాలు బయటకు రాలేదు. అయితే.. ఈ హత్యలకు ప్రధాన కారణంగా మేయర్ మేనల్లుడు చింటూగా భావిస్తున్నారు. పోలీసుల జాగిలాలు సైతం అతని ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోవటం తెలిసిందే. చింటూ కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలు జరుపుతున్నట్లు చెబుతున్నప్పటికీ.. ఇప్పటికే అతడు పోలీసులకు లొంగిపోయినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ సమాచారంపై పోలీసులు స్పందించటం లేదు.