Begin typing your search above and press return to search.
తిరుమలలో వీఐపీలంటే..లెక్కేలేదా? అలిగి వెళ్లిపోయిన వైసీపీ ఎంపీ!
By: Tupaki Desk | 13 Jan 2022 4:30 PM GMTఏడాదికి ఒక్కసారి వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు.. తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తపిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన.. కోనేటిరాయు ని.. వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుని ముక్తి పొందాలని దూరా భారం లెక్కచేయకుండా.. తిరుమల కు వస్తా రు. ఇలా.. ఈ వరుసలో ఇటీవల కాలంలో వీవీఐపీలు కూడా తిరుమల వస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. న్యాయమూర్తులు.. అధికారులు.. ఇతర దేశాల, రాష్ట్రాల నేతలు కూడా వస్తున్నారు.
అయితే.. ఇలా వచ్చినవారికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడా పొరపాట్లు దొర్లకుండా కూడా చూ స్తుంది. కానీ, ఈ ఏడాది ఏర్పాట్లు నాశిరకంగా ఉన్నాయి. దీంతో వైసీపీ ఎంపీనే టీటీడీ ఏర్పాట్లపై అలిగి కొండ దిగి వచ్చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించు కుని టీటీడీ గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసింది. ముందు వచ్చిన వారికి ముందు ప్రాదిపదికన సీఆర్వో కౌంటర్‌లో గదులు కేటాయించారు.
అయితే.. బుధవారం తిరుమలకు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు వసతి కల్పనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలోని కొన్ని గదులు మరమ్మతుల్లో ఉన్న క్రమంలో వసతికి ఇబ్బందిగా మారింది. దీంతో ఎమ్మెల్యేలకు నందకం, వకుళ విశ్రాంతి భవనాల్లోని గదులను కేటాయించారు. గదుల్లో ఏసీ లేదని, ఇనుప మంచాలు ఉన్నాయని, తమకు ఇలాంటి గదులు కేటాయిస్తారా అంటూ కొందరు రిసెప్షన్ సిబ్బందిపై ఆగ్రహించారు. వీరు వాస్తవ పరిస్థితిని వివరించడంలో ఎమ్మెల్యేలు సర్దుకుపోయారు.
ఈ క్రమంలోనే చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. రెడ్డెప్పకు వకుళమాత విశ్రాంతి భవనంలో మూడు గదులు కేటాయించారు. అయితే గదుల్లో బెడ్స్, బెడ్‌షీట్లు సక్రమంగా లేవని ఎంపీ రెడ్డప్ప అధికారులనునిలదీశారు. అయితే, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆయన నేరుగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వివరించేప్రయత్నం చేశారు. కానీ, ఆయన కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో వెంటనే గదులు ఖాళీ చేసి తిరుమల నుంచి తిరిగి వెళ్లిపోయారు. అయితే.. తర్వాత కొంత సేపటికి తిరుమల ప్రొటోకాల్ అధికారులకు విషయం తెలియడంతో ఫోన్ చేసి పరిస్తితిని వివరించారని,, దీంతో ఆయన శాంతించి తిరుమలకు చేరుకున్నారని తెలిసింది. మొత్తానికి ఈ విషయం వైరల్‌గా మారింది.