Begin typing your search above and press return to search.
ధోనీ అంటే హెలిక్యాప్టర్ షాట్సే కాదు.. చాక్లెట్స్ కూడా..!
By: Tupaki Desk | 7 April 2021 2:30 PM GMTధోని అంటే అందరికీ గుర్తొచ్చిది హెలీక్యాప్టర్ షాట్సే. ఈ షాట్స్ ద్వారానే మహీ ఎంతో ఖ్యాతి గడించాడు. ఓ గొప్ప క్రికెటర్ గా కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అతడు కొట్టే హెలీ క్యాప్టర్ షాట్స్ కు విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఇక ధోనీ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే ఉత్తమమైన కెప్టెన్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక.. ధోనీ పలు వ్యాపారాలు ప్రారంభించారు. అందులో ఖడక్ నాథ్ కోళ్ల వ్యాపారం ఒకటి. వీటితోపాటు ధోనీ పేరిట పలు ఓ క్రికెట్ అకాడమీలు కూడా వెలిశాయి. అంతర్జాతీయస్థాయి క్రికెటర్లతో ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే ధోనీ పేరిట ఇప్పుడు ప్రత్యేకంగా చాక్లెట్లు రాబోతున్నాయి. అవే ధోనీ హెలీక్యాప్టర్ చాక్లెట్స్. 7 ఇంక్‌బ్రూస్ అనే ఫూడ్ స్టార్టప్ ఈ చాక్లెట్లను తయారుచేస్తున్నది. ఈ కంపెనీలో మహీ కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఈ తరహా చాక్లెట్లు ఇప్పటికే
ముంబై, గోవా, బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. త్వరలో జార్ఖండ్, యూపీ, హర్యానా, పంజాబ్‌లోనూ మార్కెట్ లోకి రాబోతున్నాయి.
మోహిత్ బాగ్ చంద్రానీ, ఆదిల్ మిస్త్రీ, కునాల్ పటేల్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ.
మహీ హెలిక్యాప్టర్ షాట్ తోపాటు అతడి జెర్సీ నంబర్ 7 స్ఫూర్తితో ’క్యాప్టర్-7’ అనే పేరిట ఈ చాక్లెట్లను తయారు చేస్తోంది. ప్రముఖ వంటల నిపుణుడు డేవిడ్ బెలోతోకలిసి ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్ లో ఎటువంటి డిమాండ్ ఉంటుందో వేచి చూడాలి. ఇప్పటికే పలువురు క్రికెటర్లు వ్యాపారరంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. రెస్టారెంట్లు, ఇతర కంపెనీల్లో కొందరు క్రికెటర్లు భాగస్వాములుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ధోనీ ప్రస్తుతం మరో కొత్త వ్యాపారంలో అడుగుపెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.