Begin typing your search above and press return to search.
ఇండియా - పాక్ మ్యాచ్.. గేల్ ఏం చేశాడంటే..!
By: Tupaki Desk | 16 Jun 2019 8:18 AM GMTసాదారణంగా ఇండియా పాకిస్తాన్ ల మద్య వన్డే ఉంటేనే ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఆ మ్యాచ్ పై ఉంటుంది. ఇక ఇండియా పాకిస్థాన్ క్రీడాభిమానులు ఆ మ్యాచ్ ను యుద్దంగానే భావిస్తారు. ఇక ప్రపంచ కప్ లో ఇండియా పాకిస్తాన్ తలపడితే ఇంకేమైనా ఉంది. ప్రపంచం మొత్తం కూడా కన్నార్పకుండా ఆ మ్యాచ్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నేడు ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్. వరుసగ విజయాలు దక్కించుకుంటూ దూసుకు పోతున్న భారత్ ను పాకిస్థాన్ ఢీ కొట్టబోతుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ కూడా తనకు ఈ మ్యాచ్ పై ఉన్న ఆసక్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశాడు.
ఇండియా మరియు పాకిస్తాన్ జెండా రంగులతో తన డ్రస్ ను డిజైన్ చేయించుకుని దాన్ని వేసుకున్న గేల్ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 20వ తారీకున నా బర్త్ డే ఉంది. ఆ రోజు ఇదే డ్రస్ ను వేసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. రెండు జట్లకు కూడా శుభాకాంక్షలు చెప్పిన గేల్ ను ఏ జట్టు గెలుస్తుందని అభిమానులు పెద్ద ఎత్తున ప్రశ్నల కామెంట్స్ తో ముంచెత్తారు. మీ ఫేవరేట్ జట్టు ఏది అంటూ కూడా కొందరు ప్రశ్నించారు. కాని గేల్ ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. గేల్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నేడు జరుగబోతున్న మ్యాచ్ ఫీవర్ లో మునిగి పోయారు. ఇండియా మరియు పాకిస్తాన్ రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. అందుకే రెండు జట్లు హోరా హోరీగా పోరాడే అవకాశం ఉంది. అయితే గత రికార్డులు చూస్తే ఇండియా గెలుపుకే ఎక్కువ ఛాన్స్ ఉంది.