Begin typing your search above and press return to search.

జి ‘గేల్’ రాజా..! కొత్త లుక్స్​ తో అదరగొడుతున్నాడు..!

By:  Tupaki Desk   |   26 May 2021 1:30 PM GMT
జి ‘గేల్’ రాజా..! కొత్త లుక్స్​ తో అదరగొడుతున్నాడు..!
X
‘గేల్​’ పేరుకు వెస్టిండీస్​ ఆటగాడే అయినా.. ఇండియాలోనూ అతడికి ఎంతో మంది ఫ్యాన్స్​ ఉన్నారు. అదిరిపోయే ఫాలోయింగ్​ ఉంది. అందుకు కారణం ఐపీఎల్​. గేల్​ ఐపీఎల్​ లో ఏ టీం తరఫున ఆడినా అతడి ఆటకోసం ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతంగా చేసుకున్న గేల్​. ఐపీఎల్​ ను కొత్త లెవెల్​ కు తీసుకెళ్లాడు. అతడు కొట్టే భారీ సిక్సర్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. గేల్​ అవుటయిపోతే టీవీ కట్టేసే ఆడియన్స్​ కూడా ఉన్నారంటే అతడి క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ ఏడాది కరోనా దెబ్బతో ఐపీఎల్​ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్​ లో గేల్​.. పంజాబ్​ కింగ్స్​ తరపున ఆడాడు. యూనివర్సల్​ బాస్​ గా పిలుచుకొనే గేల్​ ఆట చూస్తూ చాలా మంది ప్రేక్షకులు తనివితీరి పోతుంటారు. ఇక క్రిస్​ గేల్​.. కేవలం ఆటతోనేకాక.. తన హావభావాలు, డ్యాన్స్ లు వీడియోలతోనూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంటాడు. అప్పడప్పుడు యూట్యూబ్​ లో విడుదలయ్యే అతడి వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్​ వస్తుంటాయి. ఇక గేల్​ కూడా విభిన్న వేషధారణలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అతడు క్రీజ్​ లోకి వచ్చాడంటే ప్రేక్షకులు ఎలాగైతా కళ్లు ఆర్పకుండా చూస్తారో? అలాగే యూట్యూబ్​ లో విడుదల చేసే వీడియోల కోసం కూడా ఎదురుచూసే ప్రేక్షకులు ఉన్నారు.

అప్పుడప్పుడు బికినీ బేబీలతో కూడా గేల్​ పాటలు పాడుతూ వీడియోల్లో నటిస్తుంటాడు. ఇండియన్​ ప్రేక్షకులను మెప్పించేలా అతడి వీడియోలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఈ మధ్య గేల్​ కొన్ని ప్రైవేట్​ ఆల్బమ్స్​ లో పాల్గొంటున్నాడు. రీసెంట్​గా తలపాగా చుట్టుకుని కొత్త లుక్​లో అదరగొట్టాడు గేల్​
ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను షేర్​ చేసుకున్నాడు. ‘రేపు జరగబోయే షూట్​ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ పంజాబీ డాడీ ఫైర్‌ మీద ఉన్నాడు.. మీరు కూడా ఈ వీడియో కోసం ఎదురుచూడండి’ అంటూ ఓ పోస్టు పెట్టాడు. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది.

గేల్​ న్యూలుక్​ తో అదగొడుతున్నావు. అంటూ కొంత మంది కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్​ వాయిదా పడటంతో నీ బ్యాటింగ్​ చూసే భాగ్యాన్ని కోల్పోయామంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఐపీఎల్​ సీజన్​ లో గేల్​ మొత్తం 178 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఐపీఎల్​ వాయిదా పడింది. అయితే యూఏఈ వేదికగా సెప్టెంబర్​లో ఐపీఎల్​ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అందుకోసం ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.