Begin typing your search above and press return to search.

వీడియో : ఈ క్రికెటర్ లో ఈ కోణం ఎవ్వరు చూసి ఉండరు

By:  Tupaki Desk   |   8 April 2021 7:18 AM GMT
వీడియో : ఈ క్రికెటర్ లో ఈ కోణం ఎవ్వరు చూసి ఉండరు
X
క్రికెట్‌ మైదానంలో విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో క్రిస్ గేల్ ఏ రేంజ్ లో చెల‌రేగిపోతాడో అంద‌రికీ తెలిసిందే. త‌న‌దైన రోజున బౌల‌ర్ల‌కు ఊచ‌కోతే! ప్ర‌త్యేక‌మైన ఫుట్ వ‌ర్క్ తో.. బౌండ‌రీలు సాధించ‌డానికే క్రీజులోకి వ‌చ్చాన‌ని చాటిచెప్తుంటాడు. అయితే.. ఆఫ్ ది గ్రౌండ్ ఎంతో ఉల్లాసంగా గ‌డుపుతూ ఉంటాడు గేల్‌.

గ్రౌండ్ లోనూ త‌న‌దైన ఫ‌న్నీ మూమెంట్స్ తో న‌వ్వులు పూయించే గేల్‌.. ఆట ముగిసిన త‌ర్వాత త‌న‌దైన‌ రీతిలో జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. తాజాగా.. క్రిస్ గేల్‌చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. పాప్ స్టార్ మైఖేల్ జాక్స‌న్ పాట‌కు డ్యాన్స్ చేసిన గేల్.. జాక్స‌న్ మాదిరిగానే స్టెప్పులు వేసి అల‌రించాడు. మ‌రీ ముఖ్యంగా మూన్ వాక్ స్టెప్పుల‌ను యాజిటీజ్ గా దించేసి, మైఖేల్ ను త‌ల‌పించాడు.

మ‌రి, ఇంత ఆనందం ఎందుకు అంటే.. దానికీ ఓ కార‌ణం ఉంది. రేప‌టి నుంచి ఐపీఎల్-2021 సీజన్ ప్రారంభం కా‌బోతోంది. ఈ సీజ‌న్లో పాల్గొనేందుకు ఇండియా వ‌చ్చేశాడు గేల్‌. అయితే.. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ వ‌చ్చీరాగానే క్వారంటైన్ కు వెళ్లాడు.

దిగ్విజ‌యంగా వారం రోజుల ఐసోలేష‌న్ కంప్లీట్ చేసుకున్నాడు. క‌రోనా తాలూకు ల‌క్ష‌ణాలేవీ క‌నిపించ‌క‌పోవ‌డంతో.. ఫ్రీ బ‌ర్డ్ అయిపోవ‌డ‌మే కాకుండా.. మైదానంలోకీ అడుగు పెట్ట‌బోతున్నాడు. ఈ ఆనందాన్నిడ్యాన్స్ తో ప్ర‌క‌టించాడు. మైఖేల్ జాక్స‌న్ స్పెష‌ల్ ఆల్బ‌మ్ ‘స్మూత్ క్రిమినల్’ సాంగ్ కు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కాగా.. ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌పున బ‌రిలోకి దిగుతున్నాడు గేల్‌. అయితే.. గ‌త సీజ‌న్లో ఎక్కువ మ్యాచ్ లు ఆడేఅవ‌కాశం రాలేదు. మూడోస్థానంలో దింపిన జ‌ట్టు.. అత‌ని సేవ‌ల‌ను పెద్ద‌గా వినియోగించుకోలేదు. మ‌రి, ఈ సీజ‌న్లో ఎక్క‌డ ఆడిస్తుందో.. గేల్ ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడా‌లి.