Begin typing your search above and press return to search.
నిర్ణయం మార్చుకున్నట్లుగా ప్రకటించిన గేల్
By: Tupaki Desk | 26 Jun 2019 12:24 PM GMTప్రపంచ క్రికెట్ లో క్రిస్ గేల్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వెస్టిండీస్ బ్యాట్స్ మన్ అయినప్పటికి అతడికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. అతడి ఆటతో పాటు అతడి ప్రవర్తనను కూడా ఇష్టపడే వారు ఎంతో మంది ఉంటారు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్న క్రిస్ గేల్ 2019 ప్రపంచ కప్ అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత అన్ని ఫార్మట్ల ఆటకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా కొన్నాళ్ల క్రితం ప్రకటించాడు.
తాజాగా తన నిర్ణయంను మార్చుకున్నట్లుగా గేల్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ కు మంచి ముగింపు ఉండాలనే ఉద్దేశ్యంతో మరో సిరీస్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ను ప్రకటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్ తర్వాత వెస్టిండీస్ లో టీం ఇండియా పర్యటించబోతుంది. ఆగస్టు మరియు సెప్టెంబర్ లలో వెస్టిండీస్ ఇండియాల మద్య టెస్టు సిరీస్ జరుగబోతుంది. ఆ టెస్టు సిరీస్ తర్వాత తాను రిటైర్ అవుతానంటూ గేల్ తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్బంగా పేర్కొన్నాడు.
1999లో ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అరంగేట్రం చేసిన క్రిస్ గేల్ మళ్లీ ఇండియాతో సిరీస్ ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వన్డేల్లో 10 వేల మైలు రాయి దాటిన గేల్ టెస్టుల్లో 7,214 పరుగులు చేశాడు. ఎన్నో అద్బుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు తీపి విజయాలను సిరీస్ లను తెచ్చి పెట్టిన గేల్ లేని లోటు ఆ జట్టుకు ఖచ్చితంగా ఎవరు పూడ్చలేనిది. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్ కు గేల్ ఆడుతాడో లేదో చూడాలి. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన విషయం తెల్సిందే. వచ్చే ఐపీఎల్ సీజన్ లో గేల్ మెరుపులు చూస్తామో లేదో అతడి నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది.