Begin typing your search above and press return to search.
గేల్ ను సెంచరీ కొట్టమంటున్న అమితాబ్
By: Tupaki Desk | 29 March 2016 11:48 AM GMTటీ20 ప్రపంచకప్ లో ఎలాగోలా సెమీస్ చేరిపోయింది టీమ్ ఇండియా. సెమీస్ ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం ఒకపక్క సంతోషాన్నిస్తూనే.. ఇంకోపక్క ఆందోళన కూడా కలిగిస్తోంది. మామూలుగా విండీస్ గొప్ప జట్టేమీ కాదు కానీ.. టీ20ల్లో ఆ జట్టు చాలా ప్రమాదకరం. జట్టు నిండా విధ్వంసక ఆటగాళ్లు.. టీ20 స్పెషలిస్టులు ఉండటం టీమ్ ఇండియాకు డేంజర్ సింగ్నల్స్ పంపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత భీకరమైన హిట్టర్లలో ఒకడైన క్రిస్ గేల్ ఆందోళన కలిగిస్తున్నాడు. ఐతే ఇండియన్ క్రికెట్ జట్టుకు పెద్ద అభిమాని అయిన అమితాబ్ బచ్చన్.. గేల్ ను రాబోయే మ్యాచ్ లో సెంచరీ కొట్టమని పిలుపునిచ్చాడు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే కానీ.. అదే సమయంలో ఇండియా గెలుస్తుందని కూడా అంటున్నాడు బిగ్-బి.
భారత్, వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తలపడబోయేది ముంబయిలోనే. అక్కడి సహచరులతో పాటు గేల్ కూడా చేరుకున్నాడు. ఐతే ఆశ్చర్యకరంగా బిగ్-బి మంగళవారం గేల్ ను తన ఇంటికి అతిథిగా పిలిచి విందు ఇచ్చాడు. అమితాబ్ అంటే తనకెంతో ఇష్టమని గతంలో ప్రకటించిన గేల్.. ఆ మధ్య తాను వాడే గోల్డెన్ బ్యాట్ ను ఆయనకు బహుబతిగానూ అందించాడు. ఆ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని గేల్ ను ఇంటికి పిలిచాడు బిగ్-బి. ఈ ఆతిథ్యానికి ఉబ్బితబ్బిబ్బయిపోయిన గేల్.. ఇన్ స్టాగ్రామ్ లోదీనికి సంబంధించిన ఫొటోలు పెట్టి... ‘‘మీ ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చినందకు కృతజ్ఞతలు. చాలా పుస్తకాలు కూడా కానుకగా ఇచ్చారు. బాస్ (అమితాబ్) నేను సెంచరీ కొట్టాలి, కానీ ఇండియానే గెలువాలని కోరుకున్నారు. నేను మాత్రం సెంచరీ కొట్టకపోయినా పర్వాలేదు మేము గెలువాలని కోరుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించాడు గేల్. దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. ‘‘అతను నా ఫ్యాన్ అని తెలియదు. ఎంతో హుందాగా నా ఆతిథ్యం స్వీకరించాడు. ఇండియాతో మ్యాచ్ కు సంబంధించిన నేనిచ్చిన పిలుపును అతను స్వీకరిస్తాడే ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. ఈ గురువారమే భారత్-విండీస్ మధ్య సెమీస్ జరగబోతోంది.