Begin typing your search above and press return to search.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు - అధిక వయస్కులు విధులకు రావొద్దు
By: Tupaki Desk | 29 April 2020 11:51 AM GMTకరోనా మహమ్మారి మహారాష్ట్రలో తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 8వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో కరోనా బారిన కూడా పోలీసులు పడుతున్నారు. వైరస్ బారిన పడిన ముగ్గురు పోలీస్ సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా నివారణకు ముంబై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బందిలో అధిక వయసు కలిగిన వారు విధులకు హాజరుకావొద్దని, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారు కూడా విధులు రావొద్దని ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో ముంబై పోలీసు ఉన్నతాధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 55 ఏళ్లు పైబడిన - 52 ఏళ్లు పైబడి మధుమేహం - రక్తపోటు వంటి వ్యాధులు ఉన్న సిబ్బందిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. కరోనా వైరస్‌తో మరణించిన, ప్రస్తుతం కరోనా బారిన పడిన పోలీసులు చికిత్స పొందుతున్నవారు 50 ఏళ్లు దాటిన వారు ఉన్నారు. వైరస్ సోకిన తమ సిబ్బందికి చికిత్స అందించడానికి కొన్ని ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.