Begin typing your search above and press return to search.

చుడీదార్‌, బేల్‌పురి, అరే యార్‌!!

By:  Tupaki Desk   |   28 Jun 2015 9:32 AM GMT
చుడీదార్‌, బేల్‌పురి, అరే యార్‌!!
X
ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీ.. ప్రతి ఒక్కరి నేస్తం. ఆంగ్లం నేర్వాలంటే ఆక్స్‌ఫర్డ్‌ ఉండాల్సిందే. బిల్‌గేట్స్‌ నుంచి ఇండియా మారుమూల పల్లెటూరి వాసి వరకూ ప్రతి ఒక్కరికి ఆక్స్‌ఫర్డ్‌తో పరిచయం ఉంది. అలాంటి ప్రఖ్యాతిగాంచిన డిక్షనరీలో మనం నిత్యం వ్యవహారికంలో ఉపయోగించే పదాల్ని కూడా చేర్చారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆక్స్‌ఫర్డ్‌ బుక్‌లో ఈసారి కొత్త ఎడిషన్‌లో దాదాపు 500 పదాల్ని అదనంగా చేర్చారు.

ఇందులో చుడీధార్‌, బేల్‌ పురి, దాబా, అరే యార్‌.. ఇలాంటి పదాలు కూడా ఉన్నాయి. వీటికి కూడా అర్థాలుంటాయా? అని అనకండి. రెగ్యులర్‌గా ఉపయోగించే ఈ పదాల అర్థాలేంటి? అని పొరుగు భాషల వాళ్లు బుర్ర పీక్కోకుండా వీటికి కూడా అర్థాల్ని రాసుకొచ్చారు ఇందులో. ఏదేమైనా నిత్య జీవితంలో బాగా పాపులర్‌ అయిన వాటి అర్థాల్ని చెప్పాలనుకోవడం మంచి ఆలోచనే. మనిషి సృష్టించినదే ఇదంతా. భాషను కూడా మనిషే సృష్టించాడు. అభివృద్ధి చేస్తున్నాడు. ఇలా ఎప్పటికప్పుడు లోకాన్ని సంస్కరించుకునే పనిలో భాగమే ఇదంతా. భాషా గ్రంధాల వల్ల మేధో సంపత్తి అభివృద్ధి చెందుతుంది. జయహో ఆక్స్‌ఫర్డ్‌.