Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికల్లో రివాల్వర్ తీసి సీఐ హల్ చల్

By:  Tupaki Desk   |   1 Feb 2016 4:13 PM GMT
గ్రేటర్ ఎన్నికల్లో రివాల్వర్ తీసి సీఐ హల్ చల్
X
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రస్తావిస్తుంటారు. అయితే.. అందుకు భిన్నంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేస్తున్నారు. పోలీసులకు సౌకర్యాలు కల్పించి.. జీతభత్యాలు పెంచటం.. వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు చర్యల్ని తీసుకుంటున్నప్పటికీ కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఒక సీఐ అనుసరించిన వైఖరి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

గ్రేటర్ ఎన్నికల్లో విధులు నిర్వహించటం కోసం కొందరు ఉద్యోగుల్ని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిదిలోని చింతల్ ఇక్ఫాయ్ స్కూల్ కు కేటాయించారు. విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారుల్లో కొందరిని వెనక్కి వెళ్లాలని ఉన్నతాధికారులు చెప్పారు. ఉదయం నుంచి ఉంచుకొని సాయంత్రం అలా చెప్పటంతో.. కంగుతిన్న వారు తమకు చెల్లించాల్సిన వేతనాన్ని చెల్లిస్తే వెళ్లిపోతామన్నారు.

ఈ విషయం మీద అధికారులు.. ఉన్నతాధికారుల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇదే సమయంలో ఎంటర్ అయిన బాలానగర్ సీఐ బిక్షపతిరావు అధికారులపై చేయి చేసుకోవటంతో పాటు.. సర్వీసు రివాల్వర్ బయటకు తీసి హడావుడి చేయటంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఊహించని విధంగా వ్యవహరిస్తున్న సీఐ వైఖరితో అధికారులు వణికిపోయిన పరిస్థితి. రివాల్వర్ ను బయటకు తీసి హల్ చల్ చేసి సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.