Begin typing your search above and press return to search.
ధర్నాలో కూర్చున్న సీఐ శ్రీదేవిపై వేటేశారు
By: Tupaki Desk | 16 May 2017 10:01 AM GMTలేక్ వ్యూ సీఐ శ్రీదేవిపై ప్రభుత్వం వేటేసింది. ధర్నా చౌక్ దగ్గర తాజాగా నిర్వహించిన నిరసనలో సీఐ.. మరికొందరు మహిళా కానిస్టేబుళ్లు నిరసనలో భాగస్వామ్యం కావటంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుదీర్ఘకాలంగా ధర్నా చౌక్ వద్ద నిరసనలు.. ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ధర్నా చౌక్ ను ఇందిరా పార్కు దగ్గర నుంచి తరలించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. దానికి విపక్షాలు వ్యతిరేకించటం తెలిసిందే.
తమ నిరసనల్లో భాగంగా ధర్నా చౌక్ ను తరలించొద్దంటూ విపక్షాలు నిరసనలు చేపట్టగా.. ధర్నా చౌక్ ను తరలించాలంటూ అక్కడి స్థానికులు సైతం నిరసనలు నిర్వహించారు. దీనికి పోలీసులు అనుమతులు ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. ధర్నా చౌక్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన శిబిరంలో లేక్ వ్యూ సీఐ శ్రీదేవితో పాటు.. మరికొందరు మహిళా కానిస్టేబుళ్లు సాధారణ దుస్తుల్లో ప్లకార్డులు పట్టుకొని నిరసనకారుల మధ్య కూర్చున్నారు.
అయితే.. వారిని పోలీసులుగా మీడియా గుర్తించటంతో ప్లకార్డులు వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికే యూనిఫాంతో తిరిగి వచ్చారు. దీంతో.. ప్రభుత్వమే పోలీసుల్ని పెట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ధర్నాలో కూర్చున్న సీఐ శ్రీదేవిని బదిలీ చేశారు. ఆమె తీరుపై విచారణ జరపనున్నట్లుగా సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిడ్ వెల్లడించారు. ఆమెపై పూర్తి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మొత్తంగా.. సీఐ శ్రీదేవిపై చర్యలు వాయు వేగంతో జరిగిపోవటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/