Begin typing your search above and press return to search.
పండగ పూట పప్పేనా.. అన్నాడని ఘోరం.. సీఐ భార్య నిర్వాకం
By: Tupaki Desk | 18 Jan 2023 2:30 AM GMTపండగ. అందునా పెద్ద పండుగ సంక్రాతి. అది కూడా కనుమ రోజు. దీంతో మాంసాహార ప్రియులు అంతో ఇంతో మాంసాహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. అయితే.. ఒక భార్య మాత్రం ఏమనుకుందో ఏమో.. ఆ రోజు అనూహ్యంగా ఇంట్లో పప్పు చేసింది. ఇది నచ్చని భర్త.. నేను బయట తినేస్తాను.. పిల్లలకైనా చికెన్ వండి పెట్టు అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే.. ! ఆభార్యం ఘోరానికి తలపడింది. అయితే.. ఇదేదో.. ఏ రిక్షా కార్మికుడి ఇంట్లో జరిగిన విషయం కాదు.
ఏకంగా.. సమాజంలో గౌరవంగా జీవిస్తున్న పోలీసు ఉన్నతాధికారి కుటుంబంలోనే చోటు చేసుకున్న అమానుష ఘటన. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. విజయవాడ నగరంలో పోలీస్ అధికారి భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య జరిగిన కూర గొడవే ఆత్మహత్యకు దారితీసింది.
సీఐడీ విభాగంలో చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. విజయవాడలోని పటమట తోటవారి వీధి ప్రాంతంలో నివాసముంటున్నారు. మధ్యాహ్నం 1గంట సమయంలో పిల్లల భోజనం విషయంలో భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. చికెన్ వండమని పిల్లలు అడిగితే.. లేదు.. పప్పు వండుతానని చెప్పి.. ఆమె అదే పనిచేసింది. ఇక, మధ్యాహ్నం వేళ ఇంటికి చేరుకున్న తండ్రికి పిల్లలు ఫిర్యాదు చేశారు.
దీంతో చికెన్ ఎందుకు వండలేదని.. పిల్లల భోజన విషయంలో భార్యభర్తల మధ్య చిన్న గొడవైంది. చంద్రశేఖర్ బయటకు వెళ్లగానే అతని భార్య మనస్తాపానికి గురై.. ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో చిన్నారులు తల్లిలేని పిల్లలుగా మారారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.