Begin typing your search above and press return to search.

రాజీవ్ మరణాన్ని ఐదేళ్ల ముందే చెప్పేశారట

By:  Tupaki Desk   |   30 Jan 2017 5:12 AM GMT
రాజీవ్ మరణాన్ని ఐదేళ్ల ముందే చెప్పేశారట
X
మన నిఘా వ్యవస్థ ఎంతలా పని చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ.. నిఘా వ్యవస్థ ఎలా పని చేయాలి? వారి అంచనాలు ఎలా ఉండాలి? వారు సేకరించే సమాచారం ఎంత పక్కాగా ఉండాలి? ఎంత దూరదృష్టితో ఉండాలన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ.. మాజీ ప్రధాని రాజీవ్ మరణాన్ని ఎంత ముందుగా అంచనా వేసిందో తెలిస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే.

1991లో రాజీవ్ హత్యకు గురి కాగా.. ఆయన మరణాన్ని సీఐఏ ఐదేళ్ల ముందే అంచనాకు రావటం గమనార్హం. అంతేకాదు.. రాజీవ్ అనూహ్య పరిణామాలు..రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయం మీదన కూడా పూర్తి స్థాయి అవగాహనలో అమెరికా ఉన్న విషయం గురించి తెలిసినప్పుడు.. వారెంత అలెర్ట్ గా ఉన్నారన్న విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రాజీవ్ తర్వాత భారతదేశం పేరిట 1986 మార్చిలో 23 పేజీల నివేదికను సీఐఏ సిద్ధం చేసింది. దానికి సంబంధించిన సమాచారం తాజాగా బయటకు వచ్చింది. ఈ నివేదిక తొలి వాక్యం.. ‘‘1989లో ప్రధానిగా పదవీకాలం ముగిసేలోపు రాజీవ్ పై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని’’ పేకొంది. అందుకు తగ్గట్లే 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో రాజీవ్ హత్యకు గురి కావటం గమనార్హం.

రాజీవ్ పై తీవ్రవాద సిక్కులు లేదంటే కాశ్మీరీ ముస్లింలతోపాటు అతివాద హిందువులు హత్యా యత్నం చేస్తారని స్పష్టంగా పేర్కొంది. రాజీవ్ హత్య తర్వాత దేశ ప్రధానులుగా పీవీ నరసింహారావు కానీ.. వీపీ సింగ్ లాంటి వారు ప్రధానులు అయ్యే అవకాశం ఉందన్నఅంచనాను వేసింది. తర్వాతి కాలంలో అదే జరగటం చూస్తే.. సీఐఏ ఎంత పక్కాగా ఉందో తెలుస్తుంది. అంతేకాదు.. తన వద్ద ఉన్న అణు సామర్థ్యాన్ని.. ఆ రహస్యాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ చేయమంటూ నాటి పాక్ అధ్యక్షుడు జియావుల్ హక్ తోసిపుచ్చటం.. అదంతా భారత్ సర్కారు చేస్తున్న కుట్రగా సీఐఏ తన పత్రాల్లో పేర్కొనటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/