Begin typing your search above and press return to search.

స‌త్య‌సాయి ఆధ్వ‌ర్యంలో కొత్త మ‌తం

By:  Tupaki Desk   |   25 Jan 2017 7:29 AM GMT
స‌త్య‌సాయి ఆధ్వ‌ర్యంలో కొత్త మ‌తం
X

ప్రపంచంలోని అన్నిమతాలను కలుపుకొంటూ కొత్త మతం పుట్టుకువచ్చేదని సీఐఏ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ మతాన్ని పుట్టపర్తి సాయిబాబా మొదలుపెట్టి ఉండేవారని పేర్కొంది. భారతదేశానికి సంబంధించిన కోటీ20 లక్షల పేజీలను అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఇటీవలే ఆన్‌ లైన్‌ లో ఉంచింది. వీటిలో అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయిబాబా కార్యక్రమాలపై 1990వ దశకం నాటి 16 పేజీల నివేదిక కూడా ఉంది. ఇందులోనే స‌త్య‌సాయి బాబా సార‌థ్యంలోని మ‌తం గురించిన విశ్లేష‌ణ ఉంది.

భారతదేశంపై 1940 దశకం నుంచి దాదాపు ఐదు దశాబ్దాలు సీఐఏ ఎన్ని విధాలుగా నిఘా వేసి ఉంచిందో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతాయి. అదెలా ఉన్నా.. ఆసక్తికరమైన అంశాల్లో సత్యసాయిపై రూపొందించిన నివేదిక ఒకటి. అద్భుతాలు చేసే వ్యక్తి చుట్టూ ప్రపంచ స్థాయి ప్రజా భక్తి ఉద్యమం వేళ్లూనుకుంటున్నదని ఈ నివేదిక రచయిత తొలి వాక్యాల్లో పేర్కొన్నారు. ఆర్థిక - మానవ వనరులతో కూడిన ఈ ఉద్యమం మరొక ప్రపంచ మతంగా ఉద్భవించే అవకాశాల్లేకపోలేదని రాశారు. కల్కీ అవతార్‌గా అభివర్ణించడమే కాకుండా మళ్లీ పుట్టే ఏసు క్రీస్తు లేదా ముస్లిం రక్షకుడిగా పేర్కొన్నారు. ఆయన శాంతి, న్యాయాలతో కూడిన కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని సీఐఏ నివేదికలో రాశారు. సాయిబాబా చేసే పలు గాల్లో ఆభరణాలు, విభూతి సృష్టించడం, ఆకృతులు మార్చడం, ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడం వంటి అద్భుతాలు చేస్తారని పేర్కొన్నారు. అదే సమయంలో సాయిబాబా చేసేదంతా మోసమని తేలిన పక్షంలో ఈ భక్తి ఉద్యమం కుప్పకూలిపోయేందుకు అవకాశాలు లేకపోలేదని ఆ నివేదిక చివరి పేరాలో రాయడం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/