Begin typing your search above and press return to search.
కొత్త ఆఫర్; ఏడాదికోసారి సిబిల్ రిపోర్ట్ ఫ్
By: Tupaki Desk | 19 July 2016 4:49 AM GMTగతంలో చాలా కొద్దిమందికే తెలిసిన ‘‘సిబిల్’’ మాట ఇప్పుడు చాలావరకూ సుపరిచితమే. బ్యాంకుల నుంచి అప్పులు మొదలు.. క్రెడిట్ కార్డుల జారీ వరకూ ‘సిబిల్’ ఎంతటి కీలకపాత్ర పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక వ్యక్తి రుణ చరిత్రకు సంబంధించిన వివరాల్ని సమీక్షించటంతో పాటు.. వారు జరిపే ఆర్థిక లావాదేవీలతో వారికి మార్కులు వేసే సిబిల్.. దాని నివేదిక తీసుకోవాలంటే రూ.500 ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
అయితే.. ఈ విషయం మీద తాజాగా ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఏడాదికి ఒకసారి సిబిల్ నివేదికను ఉచితంగా ఫొందొచ్చని.. ఇందుకోసం రూ.500 ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఈ సౌకర్యం ఈ ఏడాది చివరి నుంచే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. క్రెడిట్ స్కోర్ తెలుసుకునేందుకు వీలుగా సిబిల్ ఏర్పాట్లు చేస్తుందని చెప్పిన ఆయన.. లోపాల గురించి నేరుగా సంప్రదించే వెసులుబాటు కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. సిబిల్ రేటింగ్ 300 నుంచి 900 వరకు ఇస్తుంటారు. 750కు మించిన స్కోర్ ఉంటే.. మంచి రుణగ్రహీతగా బ్యాంకులు నిర్థారణకు వస్తాయి. ఏమైనా.. రోజురోజుకీ ఏదో ఒక పేరుతో ఆర్థిక భారం పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. రూ.500 ఖర్చు తగ్గే మాట చెప్పటం సంతోషకరమైన విషయంగా చెప్పక తప్పదు.