Begin typing your search above and press return to search.
ఇద్దరు జగన్ ఎమ్మెల్యేలకు అరెస్ట్ గండం?
By: Tupaki Desk | 6 Jan 2017 4:22 AM GMTఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోనుందా? విపక్షానికి చెందిన ఇద్దరు జగన్ ఎమ్మెల్యేల అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతుందా? అంటే అవుననే మాట పోలీసు వర్గాల్లోనూ.. రాజకీయవర్గాల్లోనూ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డిలు ఇద్దరూ ఎన్నికల్లో కల్తీ మద్యం పంపిణీ చేశారని సీఐడీ నిగ్గు తేల్చటమేకాదు.. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాల్ని సేకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్ తప్పదన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి.. కల్తీమద్యం కేసులో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్నిఅరెస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ.. కోర్టు నుంచి తెచ్చుకున్న స్టే కారణంగా వీరి అరెస్ట్ సాధ్యం కాలేదని చెబుతున్నారు. తాజాగా.. సీఐడీ సేకరించిన ఆధారాలు..అభియోగాలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చిత్తూరు.. నెల్లూరు.. ప్రకాశం.. గుంటూరు.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం32 నకిలీ మద్యం కేసులు నమోదు అయ్యాయి. నకిలీ మద్యం తాగి ఆరుగురు మరణించారు. కర్ణాటక.. గోవా నుంచి గుట్టుగా తెప్పించిన మద్యంలో నాణ్యత సరిగా లేకపోవటంలో మృతి చెందినట్లుగా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు.. ప్రకాశం.. గుంటూరు.. చిత్తూరు.. పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 32 కేసులు నమోదు కాగా.. వాటిల్లో 11 కేసులకు సంబంధించిన విచారణ ఇప్పటికే పూర్తి అయ్యింది.ఈ ఉదంతంపై తాజాగా కీలక ఆధారాల్ని సీఐడీ సేకరించినట్లు తెలుస్తోంది. మద్యాన్ని ఎక్కడ తయారు చేశారు? ఎక్కడ నుంచి ఎక్కడికి ఎలా తరలించారు? దీన్లో సాయం చేసినోళ్లు ఎవరు? ఇలాంటి అన్ని అంశాలపై క్షుణ్ణంగా విచారించి.. ఆరోపణలు ది.సిద్ధంచేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో సర్వేపల్లి.. కావలి ఎమ్మెల్యేల పాత్ర ఉందంటూ ఆధారాలు లభించినట్లు సీఐడీ స్పష్టం చేస్తోంది. అదే నిజమైతే.. జగన్ వర్గానికి భారీ షాక్ తప్పదనే మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/