Begin typing your search above and press return to search.
యరపతినేని అక్రమాలు.. వైసీపీ కోర్టులో బాల్..
By: Tupaki Desk | 26 Aug 2019 8:03 AM GMTగుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత - గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజు పేరిట మొత్తం ఇష్టారాజ్యంగా మైనింగ్ చేసి దోచుకున్నారన్న ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ఈ విషయంలో యరపతనేనికి సపోర్టుగా టీడీపీలోని పెద్దలు వ్యవహరించడం.. వారికి ముడుపులు అందాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే 2014లో అక్రమ మైనింగ్ విషయంలో యరపతనేని శ్రీనివాస్ - మరికొందరిపై గురువాచారి అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండడంతో ఇతడి ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు.
కేసు పెట్టిన పాపానికి తనపై యరపతినేని కక్షగట్టి బెదిరింపులకు పాల్పడ్డట్టు బాధితుడు గురువాచారి ఆరోపించాడు. యరపతినేనికి మైనింగ్ అధికారులు - పోలీసులు సహకరించారని ధ్వజమెత్తారు. దీంతో న్యాయం కోసం గురువాచారి నాడు కోర్టును ఆశ్రయించారు. నాడు విచారించిన కోర్టు యరపతినేనితోపాటు మైనింగ్ చేసిన 12మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై విచారించాలని సీబీసీఐడీని ఆదేశించింది. ఆ కేసు కోర్టులో నడుస్తోంది.
కాగా ఈ కేసు విషయంలో హైకోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై సీరియస్ గా విచారణ చేయించింది. అక్రమ మైనింగ్ పై ఏర్పాటు చేసిన సీఐడీ నివేదికను కోర్టులో సమర్పించగా.. అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున జరిగిందని కోర్టు నిర్ధారించింది. ఇంత పెద్ద కేసును నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం సీబీఐకు అప్పగించవచ్చని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని హైకోర్టు పేర్కొంది. ఇక యరపతినేని బ్యాంకు లావాదేవీల్లో కూడా అనుమానులున్న కారణంగా ఈడీ విచారణ కూడా చేపట్టాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మరి హైకోర్టు చేసిన సూచన మేరకు వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐ - ఈడీకి అప్పగిస్తుందా? లేదా రాష్ట్ర ప్రభుత్వ సీబీసీఐడీ ద్వారానే కొనసాగిస్తుందా హైకోర్టుకు తెలుపాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనేది ఆసక్తి గా మారింది.
కాగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో యరపతినేనితోపాటు టీడీపీ పెద్ద తలకాయల పాత్ర కూడా ఉన్నట్టు వైసీపీ అనుమానిస్తోంది. ఈ కేసును శీఘ్రంగా విచారిస్తే టీడీపీ పెద్ద నేతల బండారం బయటపడుతుందని యోచిస్తోంది. మరి జగన్ అండ్ కో యరపతినేని కేసు విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్నది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.