Begin typing your search above and press return to search.

టీడీపీ నేత ఇంటికి నోటీసు అంటించిన సీఐడీ ..కారణం ఏంటంటే

By:  Tupaki Desk   |   29 Feb 2020 3:30 PM GMT
టీడీపీ నేత ఇంటికి నోటీసు అంటించిన సీఐడీ ..కారణం ఏంటంటే
X
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేసారు. ఈ నేపథ్యం లోనే ఈ క్రమం లో శనివారం కంచికచర్ల లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంచికచర్ల తెలుగుదేశం పార్టీ మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ ఇంటిలో సోదాకు వెళ్లారు. అయితే, అధికారులు వచ్చే సమయానికి లక్ష్మీనారాయణ కుటుంబీకులు అందుబాటులో లేరు. అలాగే సీఐడీ అధికారులను లక్ష్మీనారాయణ ఇంటిలోనికి సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణ ఇంటి గుమ్మానికి సెర్చ్ నోటీస్ అంటించి వెళ్లారు. కాగా,టీడీపీ హయాంలో లక్ష్మీనారాయణ అల్లుడు శ్రీనివాసరావు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌ గా , లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌ గా ఉన్నారు.

టీడీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణ కు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమరావతిలో రాజధాని పేరుతో జరిగిన ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ పై ప్రత్యేక దర్యాప్తు బృందం గురిపెట్టింది. సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం నిన్న విజయవాడ లో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది.ఇందు లో భాగంగానే విజయవాడ లోని కొందరు కోటీశ్వరుల ఇళ్లల్లో కూడా తనిఖీలు నిర్వహించింది. వీరిలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు బంధువులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.