Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు మాజీ సీఎంలపై 25 సీఐడీ కేసులు

By:  Tupaki Desk   |   24 July 2015 9:15 AM GMT
ఆ ముగ్గురు మాజీ సీఎంలపై 25 సీఐడీ కేసులు
X
కర్ణాటక ముఖ్యమంత్రులు నిత్యం వివాదాల్లోనే ఉంటుంటారు.. పదవుల్లో ఉన్నప్పుడే కాదు.. పదవులు పోయిన తరువాత కూడా వారిని ఆ వివాదాలు వీడడం లేదు. కర్ణాటకకు చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై ఏకంగా 25 కేసులున్నాయి. కుంభకోణాల్లో సరి లేరు మాకెవ్వరూ అంటున్న ఆ మాజీ ముఖ్యమంత్రులు అక్రమంగా భూములను మ్యుటేషన్ చేసి సీఐడీ కేసులు ఎదుర్కొంటున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ధరమ్ సింగ్, యడ్యూరప్ప, కుమారస్వామిలపై భూముల కుంభకోణంలో సీఐడీ అధికారులు 25 కేసులు పెట్టారు. 2007 నుంచి 2012 మధ్య వీరు భూముల వ్యవహారాల్లో సుమారు 100 డీనోటిఫికేషన్లు చేశారు. వీటిలో 25 కేసుల్లో వీరి ప్రమేయం ఉందని కాగ్ నివేదిక తేల్చగా మరో 13 కేసులపైనా దర్యాప్తు జరుగుతోంది.

కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రయినా నిత్యం ఏదో ఒక వివాదల్లో చిక్కుకోవడం తెలిసిందే. దేశంలో అవినీతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి... ఇక్కడ ఇతర అవినీతి కంటే రాజకీయ అవినీతి బాగా ఎక్కువ. ఇలా ముఖ్యమంత్రుల స్థాయిలోనే అక్రమాలకు తెరతీయడమే దీనికి ఉదాహరణ.