Begin typing your search above and press return to search.
ఆ ఏడున్నర గంటలపై భూమాన ఏమన్నారంటే..
By: Tupaki Desk | 7 Sep 2016 3:59 PM GMTతునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటు చేసుకున్నహింసాకాండ గురించి తెలిసిందే. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినసీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డిని సీఐడీ పోలీసులువిచారిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం దాదాపు ఆరు గంటల పాటు విచారించిన అధికారులు.. బుధవారం దాదాపు ఏడున్నర గంటల పాటు భూమానపై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.
ఉదయం 11.30లకు మొదలైన ప్రశ్నల వర్షం సాయంత్రం వరకూ కొనసాగింది.సీఐడీ అధికారుల విచారణ అనంతరం నోరు విప్పిన భూమాన.. సంబంధం లేనిప్రశ్నల్నిఅధికారులు అడిగారని.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని..ఘటనకు ఏ మాత్రం సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్నారు. దీనికి కారణం ఏపీముఖ్యమంత్రి చంద్రబాబే కారణంగా ఆయన ఆరోపించారు. తుని ఘటన జరిగిన రోజు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనే కారణంగా భూమాన విమర్శించారు.తుని ఘటన మీద అన్నేసి గంటలు చొప్పున విచారణ జరపటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో సంబంధం లేని తనను సీఐడీ విచారణకుపిలవటంపై కాపుల గుండెలు మండుతున్నాయన్నారు.
వారంతా తనకు మద్దతు పలకటంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన అధికార దర్పం ప్రదర్శించుకోవటం కోసమే చంద్రబాబు అధికారులపై ఒత్తిడి తెచ్చి.. తనను విచారించేలా చేశారని భూమాన మండిపడ్డారు. జగన్ ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతోనే తనను విచారించినట్లుగా చెప్పారు. కుట్రతోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని.. తుని ఘటన వెనుక జగన్.. కరుణాకర్ రెడ్డి ఉన్నట్లుగా ఆరోపించారన్నారు. రెండు రోజులు సుదీర్ఘ విచారణ ముగిసిందని.. మళ్లీ ఎప్పుడు రమ్మంటారన్న విషయంపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.
తుని ఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలని అధికారులు కోరగా..వ్యక్తిగత కారణాలతో తాను హాజరు కాలేనని చెప్పిన భూమాన మంగళవారంవిచారణకు వస్తానని చెప్పి.. చెప్పినట్లే మంగళవారం అధికారుల ఎదుటహాజరయ్యారు. అయితే.. రాత్రికి రాత్రి అదనపు బలగాల్ని గుంటూరుకుతరలించిన నేపథ్యంలో పలు సందేహాలు తావిచ్చాయి. విచారణసమయంలోనే భూమానను అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించే అవకాశం ఉందన్నపుకార్లు షికార్లు చేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమాన అరెస్ట్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి పెట్టే వీలుందన్న అభిప్రాయంతో అరెస్ట్ లాంటివాటి జోలికి వెళ్లలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.