Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై సీఐడీ దర్యాప్తు
By: Tupaki Desk | 25 May 2021 9:30 AM GMTసోషల్ మీడియా .. అందులో ఏదైనా రాసుకోవచ్చు. మంచి కానీ, చెడు కానీ .. ఇష్టం వచ్చింది , ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అయితే , ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా లో వచ్చే ఏ వార్త నిజమో , ఏ వార్త అబద్దమో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా నిజమైన వార్త కంటే , తప్పుడు వార్తలే చాలా త్వరగా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. దీనితో ఆ వార్తలే నిజం అని వాటిని చాలామంది ఫాలో అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం .. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడం.
సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడం తో ,ఎవరికి తోచిన పోస్టులు పెడుతూ కొంతమంది ప్రైవసీకి విఘాతం కల్పిస్తుంటారు. అలాంటి వారిపై కొన్నిసార్లు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ దర్యాప్తు చేసేందుకు సిద్దమయింది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తుండటంతో, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. కేవలం కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెడుతున్నారని సీఐడీకి సమాచారం అందడంతో విచారణ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారనే కోణంలో సీఐడి విచారణ మొదలుపెట్టబోతోంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై పోస్టులు పెట్టడం, లైకులు, కామెంట్స్, ఫార్వార్డ్ చేయడం నేరం అని, సీఐడీ సోషల్ మీడియా, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ దీనిపై లోతైన దర్యాప్తు చేసి, ఎంతటివారైనా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ తెలియజేసింది. గతంలోనే సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.