Begin typing your search above and press return to search.
రఘురామ గాయాలపై సీఐడీ కీలక ప్రకటన
By: Tupaki Desk | 28 May 2021 6:36 AM GMTరాజద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన వైసీపీ ఎంపీ రఘురామ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీలోని ఎయిమ్స్ సంచలన రిపోర్టులను బయటపెట్టింది. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీ రఘురామ కాళ్ల కణాలు దెబ్బతిన్నాయని ఎయిమ్స్ ప్రకటన చేసింది.
ఎంపీ రఘురామను రాజద్రోహం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కస్టడీలో తనను పోలీసులు కొట్టారని రఘురామ ఆరోపించారు. అనుమానిత గాయాలను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీశీలించారు. సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. బెయిల్ పై విడుదలైన ఎంపీ రఘురామ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నాడు.
తాజాగా ఎంపీ రఘురామ అరికాళ్లలో కణాలు బాగా దెబ్బతిన్నట్లు ఆయనకు చికిత్స అందించిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం గుర్తించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. రెండు కాళ్లకు పీవీపీ కట్లు కట్టారని అంటున్నారు. రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇక ఎంపీ రఘురామ కాళ్లకు అయిన గాయాలపై ఏపీ సీఐడీ స్పష్టతనిచ్చింది. రఘురామకు పోలీసు కస్టడీలోనే గాయాలు అయ్యాయని కానీ, ఆయనకు గాయాలు ఉన్నాయని కానీ సైనిక ఆస్పత్రి ఎక్కడా చెప్పలేదని సీఐడీ పేర్కొంది. రిపోర్టుల్లో లేని ప్రచారాలు చేయరాదంటూ సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు ఆర్మీ ఆస్పత్రి సమర్పించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొందని గుర్తు చేసింది. రఘురామకు గాయాలు అయినట్టు ఎక్కడ ఆర్మీ ఆస్పత్రి చెప్పలేదని సీఐడీ గుర్తు చేసింది. గాయాలు అయినట్టు ఆర్మీ ఆస్పత్రి ధ్రువీకరించిందని తప్పుడు నిర్ధారణలతో ప్రచారాలు చేయడం సరికాదని సీఐడీ స్పష్టంచేసింది.