Begin typing your search above and press return to search.
గౌతు శిరీషను వదలని సీఐడీ.. రెండోసారి నోటీసులు జారీ
By: Tupaki Desk | 11 Jun 2022 6:14 AM GMTటీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ఇన్చార్జి గౌతు శిరీషను సీఐడీ అధికారులు వదలడం లేదు. ప్రభుత్వ పథకాలు జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర తదితరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆపేయనుందని ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గౌతు శిరీషపై సీఐడీ అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. దీంతో శిరీషకు నోటీసులు జారీ చేసి ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో అధికారులు విచారించారు. ఇప్పుడు ఇదే కేసులో మరోసారి గౌతు శిరీషకు నోటీసులు జారీ చేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
జూన్ 20న గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయానికి విచారణకు రావాలని గౌతు శిరీషను సీఐడీ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆమెకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా పలాస్ కు వెళ్లి మరీ గౌతు శిరీషకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. నోటీసులు అందినట్టు శిరీషతో సంతకం కూడా తీసుకున్నారు.
గౌతు శిరీష శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం టీడీపీ ఇన్సార్జి. అంతేనా ఐదుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూతురు. ఇంకా ముందుకు వెళ్తే ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు గౌతు లచ్చన్న మనుమరాలు. గౌడ సామాజికవర్గానికి చెందిన గౌతు శిరీష కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
కాగా జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ వాహనమిత్ర పథకాలను రద్దు చేస్తున్నట్టుగా కొందరితో ఫేక్ పోస్టులను సృష్టించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని ఆమెపై అభియోగాలున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక చిహ్నాలను దుర్వినియోగం చేశారని సీఐడీ శిరీషపై కేసు నమోదు చేసింది. ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తున్నట్టు ఫేక్ ప్రకటనలను సృష్టించి గౌతు శిరీష తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేశారు.
దీంతో ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేసిన 12 సోషల్ మీడియా ఐడీలను గుర్తించి సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా అధికారులు ఇప్పటికే నలుగురిని విచారించారు. కాగా ఈ కేసులో గౌతు శిరీషకు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఇందులో తొలి విడత విచారణకు ఆమె మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సీఐడీ అధికారుల ఎదుట జూన్ 6న హాజరయ్యారు. తప్పుడు ప్రకటనలతో కేంద్ర చట్టాలను ఉల్లంఘిస్తూ దుష్ప్రచారం చేయడంపై ఆమెను అధికారులు విచారించారు. ఆమె నుంచి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని అప్పుడే చెప్పారు.
మరోవైపు శిరీష మాత్రం సీఐడీ అధికారులు అడిగినదానికల్లా సమాధానం ఇచ్చానని చెప్పిన సంగతి తెలిసిందే. ఏడు గంటలపాటు విచారించారని, కనీసం మంచినీళ్లు, ఆహారం కూడా అందించలేదని శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని నేరాన్ని అంగీకరించాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని సీఐడీ అధికారులపై మండిపడ్డారు. ఓ కాగితంపై వారికి నోటికొచ్చినట్టు రాసుకుని.. దానిపైన సంతకం చేయాలని తనను ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో శిరీష ఈసారి ఏం చేస్తారో అనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.