Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి భూముల కొనుగోళ్ల కేసులో..ఎమ్మెల్యేకు సీఐడీ నోటీసులు!

By:  Tupaki Desk   |   17 March 2021 4:13 PM GMT
అమ‌రావ‌తి భూముల కొనుగోళ్ల కేసులో..ఎమ్మెల్యేకు సీఐడీ నోటీసులు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన త‌ర్వాత అమ‌రావ‌తిలో జ‌రిగిన అసైన్డ్ భూముల కేటాయింపు‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారంలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, కొనుగోలు దారుల‌కు లబ్ధిచేకూర్చేలా నాటి స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిందంటూ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సీఐడీ.. భూముల కేటాయింపులో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించింది. అంతేకాదు.. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై అట్రాసిటీ స‌మా ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. చంద్ర‌బాబుకు నోటీసులు కూడా జారీచేసింది.

కాగా.. ఈ విష‌య‌మై విచార‌ణ‌లో పాల్గొనేందుకు రావాల‌ని ఎమ్మెల్యే ఆర్కేకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. మీ ద‌గ్గ‌రున్న పూర్తి స‌మాచారం వెల్ల‌డించాలంటూ సీఆర్ పీసీ సెక్ష‌న్ 160 కింద ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు గురువారం (18 మార్చి) ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని సీఐడీ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరింది. దీంతో.. ఈ కేసు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందోన‌నే ఉత్కంఠ నెల‌కొంది.