Begin typing your search above and press return to search.
చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధమైందా ?
By: Tupaki Desk | 17 March 2021 5:06 AM GMTఅమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబునాయుడుకు సీఐడీ ఇచ్చిన నోటీసులోని అంశాలను గమనిస్తే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసైన్డ్ భూముల కుంభకోణానికి చంద్రబాబే ప్రధాన సూత్రధారిగా సీఐడీ భావిస్తోంది. సీఆర్డీయే ఛైర్మన్ హోదాలో అమరావతి ప్రాంతంలో ఎప్పుడో దళితులకు ఇచ్చిన 500 ఎకరాలను టీడీపీ ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
సరే అప్పుడు చంద్రబాబు ఏమి చేశారు ? ఎందుకు చేశారు ? నిబంధనల ప్రకారమే భూములు తీసుకున్నారా ? అన్నది వేరే విషయం. కానీ తాజాగా సీఐడీ ఇచ్చిన నోటీసులో కొన్ని అంశాలు ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారిముందు హాజరై విచారణకు సహకరించాలని షరతు విధించారు. అలాగే దర్యాప్తు ఉపకరించే సాక్ష్యాలను దర్యాప్తు అధికారికి అందించాలన్నారు.
ఎట్టి పరిస్దితుల్లోను దర్యాప్తు ప్రక్రియకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆటకం కలిగించకూడదన్నారు. సాక్ష్యులను బెదిరించకూడదనే నిబంధనతో పాటు సాక్ష్యాలను తారుమారు చేయకూడదనే నిబంధన కూడా ఉంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సంబంధిత కోర్టుకు హాజరవ్వాలని మరో నిబంధన ఉంది. పరిస్దితులను బట్టి దర్యాప్తు అధికారి విధించే షరతులకు కూడా చంద్రబాబు లోబడిఉండాలని స్పష్టంగా నోటీసులో చెప్పారు.
నోటీసు ప్రకారం ఈనెల 23వ తేదీన చంద్రబాబు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలి. అయితే విచారణకు చంద్రబాబు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్సుగా మారింది. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే సీఐడీ ఏమి చేస్తుందనేది తెలీదు. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబును అరెస్టు చేయటానికి కూడా సీఐడీ రంగం రెడీ చేసిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నోటీసు అందుకున్న తర్వాత చంద్రబాబు లాయర్లను పిలిపించుకుని చర్చలు జరిపారు. చంద్రబాబు తర్వాత స్టెప్ ఏమిటో చూడాల్సిందే.