Begin typing your search above and press return to search.
సీఐడీ ఉచ్చులో గంటా అనుచరులు...బిగ్ షాట్స్ కోసం వేట...?
By: Tupaki Desk | 14 Sep 2022 11:30 PM GMTఅమరావతి తో తీగ లాగితే విశాఖలో డొంక కదులుతోంది. సీఐడీ అధికారులు అసైన్డ్ భూములను కొందరు బడా బాబులు కొనుగోలు చేశారంటూ అయిదుగురిని అరెస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వారంతా మాజీ మంత్రి నారాయణ అనుచరులు అని భావించారు.
అయితే వారిలో చాలా మంది ఇపుడు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులుగా కూడా ఉన్నారు. అంత దాకా ఎందుకు గంటా సమీప బంధువు అయిన చిక్కాల విజయసారధి మీద కూడా సీఐడీ కేసు నమోదు చేయడంతో దీని వెనక ఎంత మంది బిగ్ షాట్స్ బయటకు వస్తారో అన్న చర్చ బయల్దేరింది.
ఇక సీఐడీ అధికారులు తాజాగా తమ మకాం ని విశాఖకు మార్చడంతో ఎవరు టార్గెట్ అవుతున్నారో అర్ధం కావడం లేదు అంటున్నారు. అమరావతి చుట్టూ ఉన్న భూముల మీద పెట్టుబడులు పెట్టడమే కాకుండా కొన్ని చోట్ల ఆక్రమణలకు కూడా పాల్పడ్డారని కూడా సీఐడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారుట. ఇక ఇప్పటికి పదకొండు వందల ఎకరాలలోనే చాలా మంది పెద్దల హస్తం ఉందని చెబుతున్నారు.
అయితే ఈ కేసుని మరింతగా తవ్వి వెలికితీయడానికి సీఐడీ దూకుడుగా ముందుకు సాగుతూండడంతో ఇంకెన్ని వేల ఎకరాల్లో కబ్జాలు కానీ అక్రమ లావాదేవీలు కానీ పరచుకున్నాయన్న సంగతి ఎవరికీ అర్ధం కావడంలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు అనుచరుల మీద టీడీపీ హయాంలోనే విశాఖ భూ కబ్జాల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో దీని మీద విచారణకు సిట్ కూడా వేశారు.
ఇపుడు చూస్తే గంటా అనుచరులతో పాటు టీడీపీ నేతల మీద కూడా సీఐడి దృష్టి పెట్టింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సీఐడీ విచారణలో అనేక సంచలన వాస్తవాలు బయటపడతాయని అంటున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి బిగ్ షాట్స్ కి చుట్టుకోదు కదా అన్న కంగారు అయితే రాజకీయ వర్గాలలో ఉందిట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.