Begin typing your search above and press return to search.
అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో సీఐడీ దర్యాప్తు చంద్రబాబుకు హైకోర్టు స్టే
By: Tupaki Desk | 19 March 2021 12:41 PM GMTరాజధాని భూముల వ్యవహారంలో దాఖలైన కేసులపై ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణపై దాఖలైన కేసులపై ఈ దర్యాప్తు సాగుతోంది. ఇందులో సీఆర్డీయే మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో పాటు అమరావతి రైతులని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో అసైన్డ్ భూములని దళిత రైతులకు దక్కకుండా జీవో 41 జారీ చేసి అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా సీఐడీ అధికారులు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిపై ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఓవైపు అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టులో వాదనలు సాగుతుండగానే.. మరోవైపు సీఐడీ అధికారులు మాజీ సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్‌తో పాటు మందడం గ్రామానికి చెందిన దళిత రైతుల్ని ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సీఐడీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసు పెట్టాక సాక్ష్యాలు, ఆధారాల కోసం సీఐడీ అన్వేషణ సాగించడం అనుమానాలకు తావిస్తోంది.
సీఐడీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబుపై సీఐడీ విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆయనకు అమరావతి అసైన్డ్ భూముల అంశంలో సీఐడీ కొన్నిరోజుల కిందట నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే చంద్రబాబు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పిటిషన్ పై నేడు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సీఐడీ విచారణను నిలుపుదల చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రైతులెవరూ నష్టపోలేదు కదా, సీఆర్డీఏ వాళ్లు కూడా ఫిర్యాదు చేయలేదు కదా, అని ప్రస్తావించింది. అసైన్డ్ భూముల రైతులకు కూడా నష్ట పరిహారం అందింది కదా... మరి నష్టపోయామంటూ ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. మరలాంటప్పుడు కేసు ఏ విధంగా నమోదు చేశారని నిలదీసింది.