Begin typing your search above and press return to search.
మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంలో సీఐడీ సోదాలు
By: Tupaki Desk | 10 Dec 2021 2:30 PM GMTచంద్రబాబు వద్ద గతంలో ఓఎస్డీగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టడం కలకలం రేపింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష్మీనారాయణ ఆయన వద్ద పనిచేశారు. అనంతరం పదవీ విరమణ చేశారు.
విభాజిత ఏపీ ఏర్పడ్డాక చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో సీఐడీ సోదాలను టీడీపీ ఖండించింది. ఇది కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించింది. అధికారులను వేధిస్తారా? అని నిలదీసింది. నారా లోకేష్ సైతం దీన్ని తప్పుపట్టారు. జగన్ సర్కార్ నీతిమంతులను వేధిస్తోందన్నారు.
ఇక సీఐడీ ప్రశ్నిస్తున్న సమయంలోనే లోబీపీ రావడంతో లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.