Begin typing your search above and press return to search.

106మంది టీడీపీ నేతలకు సీఐడీ షాక్

By:  Tupaki Desk   |   8 Feb 2020 10:52 AM GMT
106మంది టీడీపీ నేతలకు సీఐడీ షాక్
X
అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన వారి బాగోతం బట్టబయలు అవుతోంది. ఏపీ సీఐడీ దూకుడుగా ముందుకెళ్తూ అక్రమాలను తవ్వి తీస్తోంది.

తాజాగా అమరావతి ప్రాంతంలో 2018-2019వరకు భూములు కొనుగోలు చేసిన వారి వివరాలను ఐటీకి అందజేసి టీడీపీ నేతల గుండెల్లో సీఐడీ రైళ్లు పరిగెత్తిస్తోంది.

అమరావతిలో ఐటీ చట్టాలను ఉల్లంఘించి భూములు కొనుగోల్ మాల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్ కు, సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ తాజాగా లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ లేఖలో 106మంది టీడీపీ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. దీంతో టీడీపీ శిబిరంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలతోపాటు మరికొందరిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టి దర్యాప్తు చేస్తోంది. తాజాగా మరో ఐదుగురిపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు 106మంది టీడీపీ నేతలపై కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాయడంతో టీడీపీ శిభిరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.