Begin typing your search above and press return to search.
ఆధారాలు ఇస్తారా?; ఒక్కొక్కరిగా వస్తున్నారు
By: Tupaki Desk | 22 Jun 2015 10:04 AM GMTఓటుకు నోటు వ్యవహారంలో బయటకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ సర్కారు దృష్టి సారించటం తెలిసిందే. తమ ఫోన్ల ట్యాపింగ్ ఉదంతానికి సంబంధించి ఆధారాలు నిగ్గు తేల్చేందుకు ఏపీ సర్కారు సిట్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే.
తాజాగా బెజవాడ (విజయవాడ)లోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు టెలిఫోన్ ప్రొవైడర్ల ను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. టెలిఫోన్ ప్రొవైడర్లు ఒక్కొక్కరుగా వస్తున్నారు.
నోటీసులు ఇచ్చిన అందరి తరఫు ప్రతినిధులు స్టేషన్ కు వచ్చినట్లు తెలిసింది. మరి.. ఏపీ సర్కారు కోరినట్లుగా.. ట్యాపింగ్‌నకు సంబంధించి వివరాల్ని ఇస్తారా? తాజా విచారణతో తెలంగాణ సర్కారును ఇరుకున పడేయాలని భావిస్తున్న ఏపీ సర్కారు వ్యూహం ఫలిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.
ఇక.. టెలిఫోన్ ప్రొవైడర్లు విజయవాడకు వచ్చిన నేపథ్యంలో.. విచారణ జరుగుతున్న భవానీపురం పోలీస్ స్టేసన్ పరిధిలో ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధుల రాకపోకల్ని సైతం నిలిపివేశారు. విచారణ అత్యంత రహస్యంగా సాగుతోంది.