Begin typing your search above and press return to search.

ఇక అక్కడ 'సిగరెట్...జీవితకాలం నిషేధం': త్వరలో కొత్త చట్టం

By:  Tupaki Desk   |   10 Dec 2021 3:00 PM IST
ఇక అక్కడ సిగరెట్...జీవితకాలం నిషేధం: త్వరలో కొత్త చట్టం
X
‘ధూమపానం..హానికరం’ అన్న బోర్డ్స్ ఎక్కడపడితే అక్కడా కనిపిస్తాయి. కానీ దానిని సిగరెట్ ప్రియులు పట్టించుకోరు... అటూ విక్రేతలు చూడరు. ఇలాంటి బోర్డుులు ఎన్ని పెట్టినా సిగరెట్లు తాగేవారు.. అమ్మేవారు పెరిగిపోతున్నారు. సిగరెట్ ప్యాక్ పై కూడా రకరకాల చిత్రాలను వేసినా మార్పు రావడం లేదు. అయితే న్యూజిలాండ్ ప్రభుత్వం ధూమపానంను తగ్గించడనికి కఠినమైన చట్టాలను ఆచరణలోకి తేనుంది.

ఇప్పటికే సిగరెట్ తాగేవారిపై అనేక చర్యలు తీసుకుంటున్న ఈ దేశం తాజాగా ఓ కఠిన నిబంధనల అమల్లోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తోంది. యువత జీవితకాలం సిగరెట్ తాగకుండా దూరంగా ఉండేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. అంటే రాబోయే రోజుల్లో న్యూజిలాండ్ లో సిగరెట్ తాగే వారు లేకుండా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సిగరెట్లపై న్యూజిలాండ్ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ధూమపానం సేవించడం ద్వారా మనుషుల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా ఆర్థికంగా తీవ్ర భారం ఉంటుందిన భావిస్తోంది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాబోయే తరాల వారి ఆయుష్సు పెంచేందుకు, ఆర్థికంగా నష్టం కాకుండా ఉండేందుకు ఓ నిర్ణయం తీసుకోబోతుంది. టీనేజర్లు సిగరెట్లు కొనడాన్ని, అమ్మడాన్ని శాశ్వతంగా నిషేధం చేస్తూ చట్టం చేయనుంది.

14 ఏళ్లు ఉన్నవారితో పాటు అంతకంటే తక్కువ వయసున్నవారు సిగరెట్లు అమ్మడానికి అక్రమ కార్యకలాపంగా ప్రభుత్వం భావిస్తోంది. అంటే 2008 తరువాత పుట్టినవారెవరూ సిగరెట్లు అమ్మాడానికి వీళ్లేదు. ఆ తరువాత ప్రతీ సంవత్సరం సిగరెట్లు అమ్మకుండా వారి వయసు పెంచే విధంగా చట్టం చేయనుంది. అంటే 2027 సంవత్సరం వచ్చేసరికి దేశంలో సిగరెట్లు అమ్మకాలు ఉండకూడదనే ప్రభుత్వ ధ్యేయం.

న్యూజిలాండ్ ప్రభుత్వం గురువారం ఈ విషయంపై అధికారికంగా ప్రకటించింది. ధూమపానం నిషేధానికి ప్రభుత్వం ఎప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకుంటోంది. స్మోకింగ్ అలవాటును తగ్గించాలని నిర్ణయించిన 17 దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఇందులో భాగంగా దీని లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

2025 నాటికి సిగరేట్ తాగేవారి సంఖ్య 5 శాతం తగ్గించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడున్న నిబంధనలతో ఆ టార్గెట్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

సిగరెట్లు తాగడం వల్ల న్యూజిలాండ్లో ప్రతీ సంవత్సరం 5వేల మంది చనిపోతున్నారు. అంతేకాకుండా స్మోకింగ్ తాగి ఆనారోగ్యం బారిన పడిన వారికోసం ఆర్థిక భారం బాగానే అవుతోంది. దీంతో యుక్తవయసులోనే సిగరెట్ల అలవాటును తగ్గించే ప్రయత్నం చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశా ప్రధాని జెసిండా ఆర్డెర్స్ అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 2024 కల్లా సిగరెట్లు తాగే వారి సంఖ్య గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అయితే సిగరెట్లపై నిషేధం ఏ విధంగా అమలు చేస్తారని చర్చ మొదలైంది. వీటిని ఎవరు అమ్మొచ్చు..? ఎవరు అమ్మరాదు..? అనే నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే సిగరెట్ల నిషేధం విషయంలో న్యూజిలాండ్ కంటే భూటాన్ దేశం ఇంకా కఠినంగా అమలు చేస్తోంది. అయితే బ్లాక్ మార్కెట్ ను నిరోధించడానికి ఇటీవల కొన్ని సడలింపులు చేసింది. కానీ న్యూజిలాండ్ మాత్రం లక్ష్యం చేరే దిశగా ప్రయత్నిస్తామని తెలిపింది. ముఖ్యంగా యువతలో సిగరెట్ అలవాటును తగ్గించడానికి పక్కాగా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. జీవితకాలం స్మోకింగ్ నిషేధిస్తే వారి ఆరోగ్యాన్ని రక్షించినవారమవుతాయని అంటున్నారు. అయితే ఈ చట్టాన్ని పూర్తి అమలుకు కొంత సమయం పడుతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.