Begin typing your search above and press return to search.
ప్రచారం..క్లాప్....కెమెరా...యాక్షన్..!!
By: Tupaki Desk | 7 Oct 2018 10:20 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికలకు మూహూర్తం ఖరారైయింది దీంతో విజయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి మహాకూటమి తమ ప్రచార్నాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ ప్రచారంలో తామూ పాలు పంచుకుంటామని తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇంతకు ముందు కూడా ఎన్నికల సమయంలో తెలుగు చిత్ర సీమకు చెందిన హారోలు - హీరోయన్లు - దర్శకులు - నిర్మాతలు ప్రచారంలో ముందుండేవారు. ఇదే పంథాను తిరిగి కొనసాగించేందుకు తెలుగు చిత్రసీమ ముందుకు వస్తోంది. నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి రాగానే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది రాజకీయ రంగ ప్రవేశం చేసారు. వీరిలో కొందరు ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే మరి కొందరు పరోక్షంగా పలువురి నాయకులకు మద్దతు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ముందస్తు ఎన్నికలకు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి వైపు పలువురు హీరోలు ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు - రాష్ట్ర మంత్ర కల్వకుంట్ల తారాక రామారావుతో మంచి స్నేహం ఉంది. అలాంటి వారిలో హీరోలు నాని - విజయ్ దేవరకొండ - నాగచైతన్య - రానా ఉన్నారు. ఇక హీరోయిన్లలో సమంత అయితే కేటీఆర్ కు చాలా దగ్గరి స్నేహితురాలు అంటారు. సిరిసిల్ల చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించారు తారక రామారావు. దీంతో ఆ హీరోలు - హీరోయిన్ సమంత తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దుల విజయం కోసం ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు.
ఇక మహాకూటమిలో భాగస్వామ్యా పక్షాలైన తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి బాలక్రిష్ణ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు. నందమూరి హరిక్రిష్ణ తనయుడైన కల్యాణ్ రామ్‌ను నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటి చేయిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలోకి దిగవచ్చు. నిర్మాత - నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరడంతో సినీరంగంలో ఆయన స్నేహితులు కొందరు కాంగ్రెస్ కు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంప్యేయినర్ విజయశాంతి తన సన్నిహిత హీరోయన్లు - హీరోలను కాంగ్రెస్ కు మద్దతు పలికేల ఒప్పించే పనిలో ఉన్నారంటున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు క్రిష్ణంరాజు ఆ పార్టీ అభ్యర్దుల తనఫున ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ముందస్తు ఎన్నికలలో ప్రచారాన్ని తలకెత్తుకోనుంది.