Begin typing your search above and press return to search.
స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై సినిమాః గద్దర్
By: Tupaki Desk | 2 April 2021 3:30 PM GMTవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ అంతటా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టపరంగా తమకు ఇవ్వాల్సిన వాటిని తొక్కిపెట్టిందేగాక.. ఉన్నవాటిని కూడా అమ్మేస్తున్నారని ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో అన్ని వర్గాల ప్రజలూ ఏకతాటిపైకి వచ్చారు.
అయితే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఓ వైపు పోరాటం చేస్తూనే.. మరోవైపు ఉత్పత్తిలో పాల్గొంటున్నారు. అంతేకాదు.. అద్వితీయమైన ఘనతలు సాధిస్తున్నారు. కర్మాగారం చరిత్రలోనే అత్యధిక ఉత్పత్తిని సాధిస్తూ రికార్డులు నెలకొల్పుతున్నారు. అయితే.. వీరి పోరాటానికి రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. ప్రజాగాయకుడు గద్దర్ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపారు. వారి ఉద్యమం వర్థిల్లాలని ఆకాంక్షించారు. తాజాగా.. అన్నవరం సత్యానారాయణ స్వామిని గద్దర్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని అన్నారు. వారి ఉద్యమం దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇక, విశాఖ ప్రైవేటీకరణ అంశంతో ఓ సినిమా రూపొందుతోందని గద్దర్ తెలిపారు. ఆ చిత్రంలో తాను నటిస్తున్నట్టు కూడా తెలిపారు.