Begin typing your search above and press return to search.
సినిమాటిక్ సీన్.. మన ఆర్మీలో నిజంగానే జరిగింది
By: Tupaki Desk | 29 April 2022 5:17 AM GMTక్రమశిక్షణకు.. కఠిన పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఆర్మీ. దేశ రక్షణలో కీలక భూమిక పోషించే జవాన్ల కోసం చాలానే చేస్తున్నట్లు చెబుతున్నా.. నిజానికి వారు చేసే త్యాగాలతో పోలిస్తే.. వారికి అందేది చాలా తక్కువనే చెప్పాలి. అన్నింటికి మించి ఏదైనా కష్టం వచ్చి పడినంతనే మానవత్వంతో స్పందించే తీరు చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అలాంటి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. అందునా వారు సామాన్య ఉద్యోగులు అయితే ఎవరూ పట్టించుకోరన్న మాట తరచూ వినిపిస్తుంటుంది.
అందుకు భిన్నంగా సినిమాల్లో మాత్రమే సాధ్యమైన సీన్ ఒకటి.. తాజాగా రియల్ లైఫ్ లో ఒక సైనికుడికి ఎదురైంది. ఈ ఉదంతం గురించి విన్నంతనే ఆర్మీ ఉన్నతాధికారుల మీద గౌరవం పెరగటంతోపాటు.. ఇలాంటి తీరును ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
ఇంతకూ విషయం ఏమంటే.. ఒక జవాను కోసం ఆర్మీ ప్రత్యేకంగా ఒక హెలికాఫ్టర్ ను సిద్ధం చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే.. జమ్ముకశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద నారాయన బెహెరా బీఎస్ఎఫ్ సైనికుడిగా వ్యవహరిస్తున్నారు.
అతడికి మే 2న ఒడిశాలోని తన సొంతూర్లో పెళ్లి ఫిక్స్ అయ్యింది. అయితే.. బీఎస్ఎఫ్ సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం మంచుతో పూర్తిగా నిండిపోయి రోడ్డు మార్గం మొత్తం బ్లాక్ అయ్యింది. దీంతో పెళ్లికి హాజరయ్యేది ఎలా అన్నది ప్రశ్నగా మారింది.
పెళ్లికి తమ కుమారుడ్ని ఎలా అయినా వచ్చేలా చూడాలని ఆర్మీ అధికారుల్ని పెళ్లికొడుకు తల్లిదండ్రులు కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన బీఎస్ఎఫ్ ఐజీ రాజాబాబు సింగ్.. వెంటనే హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారి ఆదేశించిన తర్వాత పనులు వాయు వేగంతో జరిగిపోయాయి.
వెంటనే హెలికాఫ్టర్ బయలుదేరటం.. నారాయణ బెహెరా ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నాడో అక్కడికి చేరుకున్న హెలికాఫ్టర్ అతడ్ని తీసుకొని శ్రీనగర్ కు చేర్చారు. అక్కడి నుంచి ఒడిశాలోని తన సొంతూరు బయలుదేరాడు పెండ్లికొడుకు. ఏమైనా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి పెద్ద మనసును అభినందించాల్సిందే.