Begin typing your search above and press return to search.

ఏపీకి వ‌స్తున్న కంపెనీ ఉద్యోగాలు ఊడ‌బీకింది

By:  Tupaki Desk   |   18 May 2017 7:52 AM GMT
ఏపీకి వ‌స్తున్న కంపెనీ ఉద్యోగాలు ఊడ‌బీకింది
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజా అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీరంగం దిశ‌ను మార్చేసే ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించిన అంత‌ర్జాతీయ స్థాయిలో పేరున్న ప్ర‌ముఖ సంస్థ సిస్కో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో త‌న కేంద్రాన్ని నెల‌కొల్పేందుకు సిస్కో ముందుకు వ‌చ్చిందని సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆ సంస్థ త‌న పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా 1,100 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు తెలిపింది. కీల‌క రంగాల‌పై దృష్టిసారించిన అంశంలో భాగంగా దాదాపు 5,500 ఉద్యోగుల‌ను లేదా మొత్తం ఉద్యోగుల్లో 7శాతం మందిని తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ ఒక‌టి వెల్ల‌డించింది.2016లో పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను వెల్ల‌డిస్తున్న స‌మ‌యంలో ఈ అంశాన్ని వెల్ల‌డించిన‌ట్లు స‌ద‌రు మీడియా క‌థ‌నం తెలిపింది.

తాజాగా విడుద‌లైన సిస్కో మూడో త్రైమాసికం ఫ‌లితాల్లో ఈ తొల‌గింపు వివ‌రాలు ఉన్నాయి. 2018 మొద‌టి సంవ‌త్స‌రానికి గాను ఉద్యోగుల తొల‌గింపు విష‌యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. 2017కు సంబంధించి మూడో త్రైమాసికం ఏప్రిల్ 29తో ముగిసిన నేప‌థ్యంలో వివ‌రాలు వెల్ల‌డిస్తూ $11.9బిలియ‌న్ల ఆదాయం ఆర్జించిన‌ట్లు తెలిపింది. ఇది గ‌త ఏడాదితో పోలిస్తే 1 శాతం త‌గ్గుద‌ల అని వివ‌రించింది. ఈ సంద‌ర్భంగా సిస్కో సీఈఓ చ‌క్ రాబిన్స్ మాట్లాడుతూ తాము అభివృద్ధి ప‌థంలో న‌డిచేందుకు క్రియాశీల‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో ముంద‌డుగు వేస్తున్న‌ట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఆధారిత‌, ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఆధారంగా ముందుకు పోతున్న‌ట్లు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/