Begin typing your search above and press return to search.
దేశమంతటా బిల్లు తెస్తే..అసోంలోనే ఎందుకు గొడవలు?
By: Tupaki Desk | 13 Dec 2019 2:56 PM GMTపౌరసత్వ సవరణ బిల్లు - 2019 రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనిపై ఆమోద ముద్ర వేయడం - కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ రాజపత్రం(గెజిట్) విడుదల చేయడంతో... ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే, ఈ చట్టం ఈశాన్య ప్రాంతంలోని సమ్మిళిత సంస్కృతిని ధ్వంసం చేస్తుందని - పౌరసత్వ సవరణ బిల్లు ఒక ‘విభేదాలు సృష్టించే చట్టం’ అని ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటుగా విమర్శలు సాగుతున్న సంగతి తెలిసిందే. రేపటి కోసం ఆందోళన పడాలనే కాన్సెప్ట్ తో అస్సాం మొదలుకొని ఈశాన్య రాష్ట్రాలన్నీ ఆలోచిస్తున్నాయి. లోక్ సభలో సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లు (క్యాబ్)’ని ప్రవేశపెట్టినప్పటి నుంచీ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. సిటిజెన్ షిప్ సవరణ బిల్లుకు ఇతర ఈశాన్య రాష్ట్రాలకంటే అస్సాం తీవ్రంగా స్పందిస్తోంది. దీని వెనుక రెండు యుద్ధాలు - అనేక కారణాలు అన్నాయంటున్నారు.
దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్థాన్ లో పంజాబ్ తోపాటు - బెంగాల్ కూడా రెండుగా చీలిపోయి చేరాయి. ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో తరచు పాకిస్థాన్ తగాదాలకు దిగేది. దీంతో ఈస్ట్ బెంగాల్లో ఉన్న నాన్ ముస్లిం మైనారిటీలు అటు ఇటు ఉన్న పశ్చిమ బెంగాల్ లోకి - అస్సాంలోకి ప్రాణభయంతో వచ్చేశారు. ఆ తర్వాత రెండోసారి… తూర్పు బెంగాల్లో భాషా పరమైన ఉద్యమం చెలరేగి - పాకిస్థాన్ నుంచి విడిపోయే దశకు చేరింది. ఆ సమయం (బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం)లోనూ అస్సాంలోకి బంగ్లా ముస్లింలు - హిందువులు - ఇతర మతస్తులు ప్రవేశించారు. ఈ రెండు సందర్భాల్లోనూ వచ్చినవాళ్లందరికీ సిటిజెన్ షిప్ కల్పించినట్లయితే భవిష్యత్తులో తాము మైనారిటీలుగా మారిపోతామన్నది అస్సాం భూమి పుత్రల భయం.
మరోవైపు, దాదాపు 40 ఏళ్ల క్రితమే బెంగాలీలను వెనక్కి పంపేయాలని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఒక ఒప్పందం కుదిర్చారు. 1971 మార్చి 25కి ముందున్నవాళ్లను మాత్రమే అస్సామీయులుగా గుర్తించాలని - ఆ కటాఫ్ డేట్ తర్వాత వచ్చినవాళ్లను చొరబాటు దారులుగా చూడాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజెన్ షిప్ (ఎన్సార్సీ)కూడా జరిగిపోయింది. అయితే, క్యాబ్ అమల్లోకి వస్తే నాన్ ముస్లింలు మైనారిటీలు సిటిజెన్ షిప్ పొందుతారన్నది అస్సాం ప్రజల ఆందోళనకు మూల కారణం.1979లో మంగళ్ దోయి లోక్ సభా స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా - ఓటర్ల సంఖ్య అమాంతంగా పెరిగింది. దాదాపుగా 70 వేల మంది ఓటర్లు పెరిగినట్లుగా అంచనా వేశారు. అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడడానికి - ఉద్యమానికి ఈ ఉప ఎన్నికలే కారణం.
రాజీవ్ గాంధీ తన హయాంలో ఒప్పందం చేసుకోవడంతో… ఆసు విద్యార్థి నాయకులంతా అస్సాం గణ పరిషత్ (ఏజీపీ)గా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసి - ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అస్సాంలో స్థానికుల హక్కులు - ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు - వనరుల వినియోగం వంటి విషయాల్లో ఎక్కడా రాజీపడరని పై రెండు ఊచకోతలు చెబుతున్నాయి. తాజా సవరణ బిల్లు వల్ల కటాఫ్ డేట్ 2014 అవుతుందని - ఇది అస్సాం ఒప్పందానికి తూట్లు పొడవడమేనని ఉద్యమకారులు వాదిస్తున్నారు.మణిపూర్ కి ఫారిన్ టూరిస్టులు - బంగ్లాదేశ్ - నేపాల్ - మయన్మార్ వంటి పక్క దేశాల నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరుగుతుండటంతో జనాభాలో మార్పు జరుగుతోంది. ఫలితంగా ఉద్యోగాలు - వనరులపై స్థానికులకు - బయటి వారికి మధ్య పోటీ నెలకొంటోంది. తాజా బిల్లుతో ఇది మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.