Begin typing your search above and press return to search.
మసాజ్ దందాలో సివిల్ ర్యాంకర్!
By: Tupaki Desk | 19 Jun 2018 10:01 AM GMTఅతడో సివిల్ ర్యాంకర్....రేపో మాపో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేయాల్సిన వ్యక్తి......గతంలో ఒకరితో ఉన్న వివాదం వల్ల ప్రస్తుతం విత్ హెల్డ్ లో ఉన్నాడు. ఆ వివాదాన్ని సద్దుమణిగించి ఎలాగోలా ఉద్యోగంలో చేరాల్సిందిపోయి.....పెడదారులు పట్టాడు. ఈజీమనీ కోసం కక్కుర్తి పడి అక్రమ పద్దతిలో మసాజ్ సెంటర్ నడుపుతూ అడ్డంగా బుక్కయ్యాడు. హైటెక్ దందా నడుపుతున్న ఆ యువకుడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. విశాఖకు చెందిన సంతోష్ ఎమ్మెస్సీ చదివాడు. సివిల్స్ కోచింగ్ కు హైదరాబాద్ వచ్చి మరో వ్యక్తితో కలిసి సెలూన్ నిర్వహించాడు. అయితే, ఆ వ్యక్తితో మనస్పర్థలు రావడంతో అతడి భార్యపై దాడి చేశాడు. దీంతో, ఆ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లాడు. అయితే, ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ప్రిలిమ్స్ - మెయిన్స్ - ఇంటర్వ్యూలు పూర్తి చేశాడు.
కానీ, అతడిపై ఉన్న కేసు కారణంగా అతడిని విత్ హెల్డ్ లో పెట్టారు. అయితే, తనపై ఉన్న కేసును మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నించకుండా పెడదారి పట్టాడు. ఆ సెలూన్ ను మసాజ్ సెంటర్ గా మార్చి 'క్రాస్ మసాజ్' (ఆడవారికి మగవారితో - మగవారికి ఆడవారితో) చేయించడం ప్రారంభించాడు. తన బంధువు రాధారెడ్డితో కలిసి చట్ట విరుద్ధంగా మసాజ్ సెంటర్ నడుపుతున్నాడు. ముగ్గురు అమ్మాయిలతో మగవారికి మసాజ్ చేయిస్తున్నాడు. వారికి కనీసం వేతనాలు కూడా ఇవ్వకుండా డబ్బులు దండుకున్నాడు. సంతోష్ దందా గురించి తెలుసుకున్న పోలీసులు సంతోష్ తో సహా ముగ్గురు యువతులను - మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సంతోష్ తో పాటు మిగతా యువతులను పోలీసులు విచారణ జరుపుతున్నారు.