Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్టు కొలీజియం గరం: ఎన్వీ రమణకు పదవి దక్కేనా?
By: Tupaki Desk | 8 April 2021 5:44 AM GMTజస్టిస్ ఎన్వీ రమణ కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన వేళ జడ్జీల నియామకాల్ని చేపట్టే సుప్రీంకోర్టు కొలీజియం భేటి నిర్వహిస్తుండడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సుప్రీం సీజేఐ బొబ్డే గురువారం ఈ భేటి జరుపనుండడం ఆసక్తి రేపుతోంది.
సుప్రీంకోర్టులో కీలక పదవుల భర్తీకి అర్హులైన అభ్యర్థులపై చర్చించేందుకు సీజేఐ బోబ్డే గురువారం కొలీజియం భేటిని నిర్వహిస్తున్నారు. మొత్తం ఐదుగురు సభ్యులుంటే కొలీజియంలో జస్టిస్ బోబ్డేతోపాటు జస్టిస్ లు ఎన్వీరమణ, నారీమన్, ఉమేశ్ లలిత్, మాణిక్ రావ్ ఖన్విల్కర్ ఉన్నారు.
కాగా కొలీజియం భేటి జరపాలన్న సీజేఐ నిర్ణయంపై ఇద్దరు జడ్జీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొత్త సీజేఐగా జస్టిస్ రమణ నియామకం తర్వాత వారెంట్లు జారీ అయ్యాక పాత సీజేఐ ప్రస్తుతం ఎలాంటి సిఫార్సులు చేసినా అది సరైన విధానం కాబోదని ఇద్దరు జడ్జీలు వాదించారు.
అయితే రమణ పేరుకు ముందే ఈ కొలీజియం భేటి నిర్ణయించారని.. షెడ్యూల్ మారకుండా బోబ్డే ఈ భేటి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. దీనివెను ప్రస్తుత సీజేఐ బోబ్డే ఉద్దేశం మరోలా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.
కర్ణాటక హైకోర్టు జడ్జి బీవీ నాగర్నతను సీజేఐ బోబ్డే సుప్రీంకోర్టు జడ్జిగా తీసుకోవాలని కొలీజియంలో ప్రతిపాదిస్తున్నారట..ఈమె నియామకం అయితే జస్టిస్ నాగరత్న రాబోయే రోజుల్లో భారత తొలి మహిళా సీజేఐ అయ్యేందుకు అవకాశాలుంటాయి. దీంతో ఈ నియామకాలను ప్రస్తుత జడ్జీలు ఆమోదిస్తారా? లేదా అన్నది చూడాలి.