Begin typing your search above and press return to search.
మూన్ లైటింగ్ విధానంపై సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 6 Dec 2022 3:52 AM GMTకరోనా ఎంట్రీ.. లాక్ డౌన్ పుణ్యమా అని వర్క్ కల్చర్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ కల్చర్ పెరిగిపోయింది. దీంతో ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలోనే ఉద్యోగులు ఒకే సమయంలో రెండు మూడు పనులు చేస్తూ రెండు చేతుల సంపాదించడం మొదలు పెట్టారు.
అయితే ఇలా చేయడం వల్ల కంపెనీలకు నష్టం వాటిల్లుతుందని పలు ఐటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూన్ లైటింగ్ విధానాన్ని బడా కంపెనీలన్నీ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ కు చెందిన పలు కంపెనీలు మూన్ లైటింగ్ విధానంలో రెండో ఉద్యోగం చేస్తున్న కొందరినీ పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగులు మాత్రం మూన్ లైటింగ్ విధానంలో పని చేస్తే తప్పేంటీ? అని ప్రశ్నిస్తున్నారు. భారత్ లో మూన్ లైటింగ్ విధానంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు తాజా చీఫ్ జస్టిస్ ధనంజయ వై చంద్ర చూడ్ తాను సైతం మూన్ లైటింగ్ కు పాల్పడ్డారని ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.
సీజేఐ చంద్రచూడ్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మూన్ లైటింగ్ విధానంపై ప్రస్తావించారు. తాను లాయర్ గా పని చేస్తున్న కొత్తలో ఆల్ ఇండియా రేడియోలో జాకీగా పని చేస్తూ ‘మూన్ లైటింగ్ ’కు పాల్పడినట్లు తెలిపారు. ఆ సమయంలో తన వద్ద డబ్బులు సరిపోక పోవడంతో ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు సైతం చేసినట్లు వివరించారు.
తాను ఆర్‌జేగా ఉన్న సమయంలో ‘‘ప్లే ఇట్ కూల్’’.. ‘‘ఎ డేట్ విత్ యు’’.. ‘‘సండే రిక్వెస్ట్’’ వంటి షోలను హోస్ట్ చేశానని సీజేఐ తెలిపారు. ఈ వీడియోను బార్ అండ్ బెంచ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. కాగా మూన్ లైటింగ్ అంటే ఒక ఉద్యోగం చేస్తూ అదనపు నగదు కోసం మరో పని చేయడం..దీనిని పలు కంపెనీలు తప్పుబడుతున్నాయి.
మనలో చాలామంది అదనపు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తూ కన్పిస్తుంటాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ వచ్చాక ఐటీ కంపెనీలు ఈ మూన్ లైటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిబ్బందిని తొలగిస్తున్నాయి. దీంతో ఈ మూన్ లైటింగ్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానానికి ఆనంద్ మహీంద్రా లాంటి బడా పారిశ్రామిక వేత్తలు గతంలో మద్దతు తెలిపారు. ఇక తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ వై చంద్రచూడ్ సైతం మద్దతుగా మాట్లాడటంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.