Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ పై దాడి ఆపమని పుతిన్ ను ఆదేశించగలమా?

By:  Tupaki Desk   |   3 March 2022 5:30 PM GMT
ఉక్రెయిన్ పై దాడి ఆపమని పుతిన్ ను ఆదేశించగలమా?
X
ఉక్రెయిన్ పై దాడిని ఆపమని తాము రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆదేశించగలమా? అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. దానిపై విచారణలో భాగంగా ఆయన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తాను ఒక వీడియోను చూశానని.. ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని అందులో ప్రశ్నించారని.. ఈ సైనిక చర్యను ఆపండని నేను రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలనా? అని ఎన్వీ రమణ ప్రశ్నించారు.

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థుల గురించి మేం ఆందోళన చెందుతున్నామని.. కేంద్రం తన పని తాను చేస్తోందని సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు అనంతరం రొమేనియాకు సమీపంలో ఉక్రెయిన్ సరిహద్దులో చిక్కుకుపోయిన విద్యార్థులకు సాయం చేయడానికి కృషి చేయాలని అటార్నీ జనరల్ కు సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇప్పటివరకూ ఉక్రెయిన్ నుంచి దాదాపు 17వేల మంది భారత పౌరులు ఆ దేశాన్ని వీడారు. ఇప్పటివరకూ 3వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. భారత వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్ గంగాలో చేరింది. రష్యా సడెన్ గా యుద్ధం ప్రకటించడంతో భారతీయులను తీసుకురావడం కానకష్టంగా మారింది.