Begin typing your search above and press return to search.

మిస్టర్‌ పర్‌ ఫెక్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

By:  Tupaki Desk   |   6 May 2019 3:36 PM GMT
మిస్టర్‌ పర్‌ ఫెక్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌
X
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కు త్రిసభ్య కమిటీ క్లిన్‌ చిట్‌ ఇచ్చింది. దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి సీజేగా ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్‌ పై లైంగిక వేధింపులు రావడంతో ఆయనే స్వయంగా ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీ రెండు వారాల పాటు విచారణ జరిపింది. ఈ విచారణలో సీజేపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేలియడంతో.. త్రిసభ్య కమిటీ ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

సీజే జస్టిట్‌ గొగోయ్‌ పై వచ్చిన ఆరోపణలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఏర్పాటైనా త్రిసభ్య కమిటీకి జస్టిస్ ఎస్‌ ఏ బాబ్డే నేతృత్వం వహించారు. విచారణ పూర్తైన తర్వాత సీనియర్ జడ్జికి తన నివేదికను ఆయన సమర్పించారు. అయితే ఇది అనధికారిక విచారణ కాబట్టి దీన్ని నివేదికను బహిరంగ పర్చలేమని త్రిసభ్య కమిటీ పేర్కొంది. ఇక ప్యానెల్‌లో జస్టిస్ ఇందిరా బెనర్జీ - జస్టిస్ ఇందు మల్హోత్రాలు మిగతా ఇద్దరు సభ్యులుగా ఉన్నారు.

సుప్రీంకోర్టులో పని చేసే మహిళా మాజీ ఉద్యోగిని జస్టిస్ రంజన్ గొగోయ్ తనను రెండు సార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంటూ 22 మంది సుప్రీంకోర్టుల జడ్జీలకు అఫిడవిట్ సమర్పించింది. గతేడాది అక్టోబరులో చీఫ్ జస్టిస్‌ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను లైంగికంగా వేధించాడని తన అఫిడవిట్‌ లో ఆ మహిళ పేర్కొంది. ఈ విషయం బయటపెట్టడంతో తనను ఉద్యోగం నుంచి తొలిగించారని పేర్కొంది. అంతకుముందు జస్టిస్ గొగోయ్ నివాసంలో క్లర్క్‌గా ఆమె పనిచేశారు. ఇప్పుడు రంజన్‌ గొగోయ్‌ కు త్రిసభ్య కమిటీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం తనను అసంతృప్తికి గురిచేసిందని అన్నారు సదరు మహిళ. తన పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. తనకు మళ్ళీ అన్యాయం జరిగిందన్న మహిళ.. అంతర్గత విచారణ కమిటీకి అన్ని ఆధారాలు ఇచ్చినా తనకు న్యాయం జరగలేదని అన్నారు. తన‌ కుటుంబానికి హాని పొంచి ఉందని పత్రికా ‌ప్రకటనలో పేర్కొన్న ఆ మహిళ.. తన తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానన్న చెప్పారు.